»   »  ఇలా కూడా ఆడుకుంటున్నారు... సాయిధరమ్ తేజ్ తో వెన్నెల కిషోర్ కామెంట్స్

ఇలా కూడా ఆడుకుంటున్నారు... సాయిధరమ్ తేజ్ తో వెన్నెల కిషోర్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం మెగా యంగ్ హీరోలు అందరిలోకి అదృష్టం సాయి ధరమ్ తేజ్ వైపు ఎక్కువగా ఉంది. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' టాప్ సక్సస్ అవ్వడంతో ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో చాల సినిమాలు ఉన్నాయి. అయితే వచ్చిన విజయాలతో ఎటువంటి ఇగోను ప్రదర్శించకుండా అందరితో సరదాగా కలిసిపోతాడు అన్న కామెంట్స్ కూడ సాయి ధరమ్ కెరియర్ కు బాగా ఉపయోగ పడుతున్నాయి.

 Sai dharam tej, vennela kishor comments gone viral on social media

దీనికితోడు సోషల్ మీడియాను కూడ సాయిధరమ్ తేజ్ బాగా ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు ట్విట్స్ పెడుతూ తన అభిమానులకు అందుబాటులో ఉంటాడు ఈ యంగ్ హీరో షూటింగ్‌ స్పాట్‌లో అయితే ఈ హీరో చేసే హంగామా అంతా ఇంతా కాదట. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌, సత్య వంటి కమెడియన్లతో తేజు కలిస్తే విపరీతమైన ఫన్‌ జనరేట్‌ అవుతుందట. ఇప్పుడు వీరు చేసే ఈ ఫన్‌ షూటింగ్‌ స్పాట్‌ నుంచి సోషల్‌ మీడియాకు మారింది.

ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తేజు 'విన్నర్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో వెన్నెల కిషోర్‌ కూడా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి వెన్నెల కిషోర్‌ కొన్ని ఫోటోలను షేర్‌ చేశాడు. డైరెక్టర్‌ గోపీచంద్‌.. రోజూ నైట్‌షూట్‌ అంటూ విసిగించడం.. తేజు, కిషోర్‌ చచ్చాంరా బాబూ అనుకుంటూ బాధపడడం.. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.ప్రస్తుతం బలుపు ఫేమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వం లో "విన్నర్" మూవీ లో నటిస్తున్నాడు..రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొన్ని రోజులు నైట్ షూట్స్ జరుగుతున్నాయట. ఈ నేపథ్యం లో కమెడియన్ వెన్నెల కిషోర్ , సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వేసుకుంటూ ఓ కామెడీ పిక్ ను సోషల్ మీడియా లో వదిలారు. ఇప్పుడు ఈ పిక్ తెగ హల్చల్ చేస్తుంది..

 Sai dharam tej, vennela kishor comments gone viral on social media

వాస్తవానికి తేజు , చాల మంది తో చాల సన్నిహితంగా ఉంటాడట..అది సెట్స్ లోనైనా , బయటైనా..ముఖ్యం గా వెన్నెల కిషోర్ తో ఎక్కువ టైం స్పీడ్ చేస్తాడట. వీరిద్దరూ ఒకదగ్గర కలిస్తే నవ్వులే నవ్వులను అందరూ చెప్పుకుంటారు. ప్రస్తతం వీరిద్దరూ విన్నర్ లో నటిస్తున్నారు..రోజు నైట్ షూట్స్ జరగడం తో దానిపై వీరి కామెంట్స్ ను ఇమేజ్ రూపం లో పెట్టి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు..ఇప్పుడు ఈ పిక్ చూసినవారంతా తెగ నవ్వుకుంటూ షేర్ చేస్తున్నారు..మీరు కూడా ఆ పిక్ ఫై ఓ లుక్ వెయ్యండి.

English summary
teju vennela kishor funny comments photos which are made by fans gone viral on social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu