»   » 'అదే డేట్‌, అదే ప్లేస్‌, అదే టైమ్‌, అదే ట్రాక్‌, అదే రేంజ్' ఇదే నెట్ లో హల్ చల్

'అదే డేట్‌, అదే ప్లేస్‌, అదే టైమ్‌, అదే ట్రాక్‌, అదే రేంజ్' ఇదే నెట్ లో హల్ చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'నీలాంటి వాళ్లు అడుగడుగునా ఉంటారు. నాలాంటోడు అదురుగా ఉంటాడు. అదే డేట్‌, అదే ప్లేస్‌, అదే టైమ్‌, అదే ట్రాక్‌, అదే రేంజ్‌, నేను రెడీ' అంటూ సాయిధరమ్‌ వచ్చేసాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన 'విన్నర్‌' ఫస్ట్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

Sai DharamTej’s “Winner” Teaser

బేబీ భవ్య సమర్పణలో లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), టాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే నెల 24న విన్నర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ టీజర్ ని చూడవచ్చు.

'నీలాంటోడు అడుగడుగునా ఉంటారు. నా లాంటోడు చాలా అరుదుగా ఉంటాడు' అంటూ సాయిధరమ్‌తేజ్‌ పలికిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నల్లమలపు బుజ్జి, ఠాగూర్‌ మధులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రీడానేపథ్యంలో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరి సాయిధరమ్‌ ఎందులో 'విన్నర్‌' అయ్యాడో తెలియాంటే చిత్రం విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి విన్నర్‌గా ఎలా నిలిచాడనేది ఈ చిత్ర కథ. ఇందులో సాయిధ‌ర‌మ్ ఛాలెంజింగ్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. గుర్ర‌పు రేసులు, రేస్ కోర్టులు అంటూ సంథింగ్ ఏదో చూపించేందుకు గోపిచంద్ మ‌లినేని ప్ర‌య‌త్నిస్తున్నాడుట‌. సాయిధ‌ర‌మ్ గుర్ర‌పుస్వారీ చేస్తూ అల‌రించ‌బోతున్నాడు. అయితే విన్న‌ర్ స‌వాల్ ఎవ‌రితో? ఎందుకోసం అన్న‌ది తెలియాలంటే మాత్రం కాస్తంత వేచి చూడాల్సిందే.

English summary
Sai Dharamtej 's latest movie Winner which has been directed by Gopichand Malineni is currently in final stages of shoot and the makers unveiled the first teaser of the film on the eve of Sankranthi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu