»   »  టాలీవుడ్ పరిశ్రమపై సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ పరిశ్రమపై సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సాయి కుమార్ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ యాంకర్ గా ఆయన తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పోలీస్ స్టోరీ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన ఆయన విజయవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమితులయ్యారు.

అయితే తెలుగు సినిమా పరిశ్రమలో తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటున్నాడు సాయి కుమార్. ఇటీవల ఆయన మాట్లాడుతూ...కన్నడ సినీ పరిశ్రమ గుర్తించినంతగా తనను తెలుగు సినిమా పరిశ్రమ గుర్తించలేదని వ్యాఖ్యానించారు. కన్నడలో సంవత్సరానికి ఏడెనిమిది సినిమాలు హీరోగా చేస్తున్న సమయంలో కూడా తెలుగు దర్శక నిర్మాతలు తనను కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగానే చూసారు' అని అన్నారు.

Sai Kumar about Tollywood

తెలుగులో పోలీస్ స్టోరీ చిత్రం రాకుండా ఉంటే...ఇప్పటికీ అంతా నన్ను మరిచిపోయేవారు' అని వ్యాఖ్యానించారు. తన టాలెంటుకు తగిన అవకాశాలు, పాత్రలు రావడం లేదని సాయి కుమార్ ఫీలువుతున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. అయితే పలువురు తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చామని అంటున్నారు.

English summary
Sai Kumar said, 'more than Tollywood, Sandalwood recognized me and gave me stardom. Even when I was doing 7-8 films per year as a hero, Telugu filmmakers didn't recognize me and still consider me only as a dubbing artist. If 'Police Story' had not happened, they might have already forgotten me by now'.
Please Wait while comments are loading...