»   »  ఇదంతా నాకు ముందే తెలుసు.., నాకు పోలీస్ అభిమానులున్నారు: సాయి కుమార్

ఇదంతా నాకు ముందే తెలుసు.., నాకు పోలీస్ అభిమానులున్నారు: సాయి కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పోలీస్‌స్టోరీ' విడుదలై ఎన్నో ఏళ్లు గడుస్తున్నా అందులో సాయికుమార్‌ పోషించిన 'అగ్ని' పాత్ర, అతని హావభావాలు ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లల్లో కదలాడుతూనే ఉన్నాయి. పోలీస్ కి నిజ‌మైన గుర్తింపును సాయి కుమార్ తీసుకొచ్చాడంటే అతిశ‌యోక్తి కాదేయో. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సాయి కుమార్ సినీ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. ఎంద‌రో న‌టుల‌కు త‌న గొంతును అరువు ఇచ్చాడు. ఒక వైపు డ‌బ్బింగ్ చెబుతూనే మ‌రొవైపు న‌టుడిగా కొన‌సాగారు. ముందు హీరోగా కన్నడ ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందిన ఆయన ఆతర్వాత తెలుగులో కూడా హీరోగా నటించారు. అయినప్పటికీ ఇక్కడ ఆశించినంత విజయాలను పొందలేకపోయారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్పి...డైలాగ్ కింగ్ అనే బిరుదును ఆయ‌న సొంతం చేసుకున్నాడు.

ఎక్కువగా కన్నడ లోనే హీరో గా చేసిన సాయి కుమార్ ప్రస్థానం లాంటి సినిమా తో నటవిశ్వరూపాన్ని చూపి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారాడు ఈమధ్య 'జనతా గ్యారేజ్'లో పని చేసిన అనుభవం గురించి మీడియాతో మాట్లాడాడు సాయికుమార్. ఈ సినిమా కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని తాను విడుదలకు ముందే అంచనా వేశానని.. ఈ విషయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెప్పానని చెప్తూ మరికొన్ని విషయాలు పంచుకున్నాడు.

Sai Kumar Predicts Janatha Garage Huge Success

''నా మొదటగా డబ్బింగ్ చెప్పింది పెద్ద ఎన్టీఆర్‌తోనే. ఆ తర్వాత 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో ఆయనతో కలిసి నటించడమే కాదు.. దెబ్బలు కూడా తిన్నాను. ఆ తర్వాత బాలయ్యతో రౌడీ ఇన్‌స్పెక్టర్, సీమసింహం చేశాను. కళ్యాణరామ్‌తో 'పటాస్'లో నటించాను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్‌ చేశాను. అలా నందమూరి కుటుంబంలోని హీరోలందరితో నటించాను. తారక్‌తో సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ ఆ పెద్దాయనతో చేస్తున్న అనుభూతి కలిగింది. 'జనతా గ్యారేజ్‌'లో చాలామంది గొప్ప నటుల మధ్య నటించడం నా అదృష్టం.

ఈ అవకాశం ఇచ్చిన కొరటాల శివ గారికి థ్యాంక్స్. జనతా గ్యారేజ్ వంద కోట్ల సినిమా అని నేను ముందే తారక్‌తో అన్నాను. అది నిజమైనందుకు ఆనందంగా ఉంది. పోలీస్ స్టోరీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాకు ఎంత పేరొచ్చిందో.. ఒక డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్‌గా నాకు 'జనతా గ్యారేజ్‌'తో అంతే పేరొచ్చింది. నాకు పోలీసుల్లో చాలామంది అభిమానులున్నారు. దానికి కారణం ఏంటంటే నాకు పోలీసులు చాలా మంది అభిమానులున్నారు. నా 'పోలీస్ స్టోరీ' సినిమా చూసి ఎంతోమంది పోలీసులు స్ఫూర్తిపొందారు'' అని సాయికుమార్ అన్నాడు.

English summary
Sr Actor Sai Kumar say s that he was predicted Janatha Garage Huge Success
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu