»   » నాన్న నా నటనకు పాస్ మార్కులు వేసారు

నాన్న నా నటనకు పాస్ మార్కులు వేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాన్న సినిమా చూసి నీ నటనకు పాస్‌ మార్కులు వేస్తున్నానని చెప్పారు. డాన్స్‌, ఫైట్లు బాగా చేశావు. నువ్వు ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ముందు ముందు నీకే తెలుస్తుందన్నారు అంటూ డబ్బింగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆది చెప్పుకొచ్చారు. ఆది హీరోగా పరిచయం అవుతూ 'ప్రేమకావాలి' అనే చిత్రం విడుదల అయింది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సినిమా వర్కవుట్ కాకపోయినా కుర్రాడు బాగా చేసాడు అనే టాక్ ను మూటగట్టుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించాడు. అలాగే... నాన్న నన్ను సినిమాల్లోకి రావద్దనడానికి కారణం ఉంది. ఈ రోజుల్లో హీరోగా పరిచయం కావడం అంటే ఆషామాషీ కాదు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక వద్దన్నారు. హృతిక్‌ రోషన్‌కి కూడా అతని తొలి సినిమా వాళ్ల నాన్నగారే నిర్మించారు. నాకు మాత్రమే బయటి నిర్మాణ సంస్థలో నటించే గొప్ప అవకాశం దక్కింది అన్నారు. ఇక తనకు తన తండ్రి ఒక్కరే ఆదర్శం కాదని చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున ఈ నలుగురు హీరోలంటే ఇష్టమని అన్నారు. ఆ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను. నటుడు అనేవాడు ప్రతి సినిమాకి కొత్తగా కనిపించాలనే అంశాన్ని వీళ్ల నుంచే స్ఫూర్తిగా తీసుకున్నాను అన్నారు.

English summary
Sai Kumar son's “Prema Kavali” film was not up to the mark and failed to pull a chord in the hearts of the audiences. But the highlight of the film is undoubtedly newbie Aadi’s performance along with debutant Isha who adds the dash of glamour. The film has myriad emotions love, action and comedy as well as noteworthy cinematography and enticing scenery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu