»   » అప్పుడు భయపడ్డాను.. నేను ఏడుస్తుంటే.. అతను ఏడ్చాడు.. సాయి పల్లవి (ఇంటర్వ్యూ-2)

అప్పుడు భయపడ్డాను.. నేను ఏడుస్తుంటే.. అతను ఏడ్చాడు.. సాయి పల్లవి (ఇంటర్వ్యూ-2)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిదా సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ భానుమతి పాత్రలో నటించిన సాయి పల్లవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఫిదా చిత్రం విజయంలో సాయి పల్లవి కీలకంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. మహిళా సాధికారితకు భానుమతి చిహ్నంగా నిలిచింది. ఈ నేపథ్యంలో 'ఫిదా భానుమతి సాయి పల్లవి ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఫిదా గురించి, చిత్ర విజయం గురించి సాయి పల్లవి వెల్లడించిన స్పందన ఆమె మాటల్లోనే..

సావిత్రి, సౌందర్యలతో పోల్చుతున్నారు..

సావిత్రి, సౌందర్యలతో పోల్చుతున్నారు..

ఫిదా తర్వాత సావిత్రి, సౌందర్య లాంటి యాక్టర్లతో పోల్చుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అదే నాకు పెద్ద ప్రశంస. ఇంకా ఇలా ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. మొదటి సినిమాకే ఇలాంటి ప్రశంసలు రావడం చాలా అనుభూతిని కలిగిస్తున్నది.

ఒక ఏడాది పట్టింది..

ఒక ఏడాది పట్టింది..

ప్రేమమ్ తర్వాత నేను భానుమతిగా మారడానికి ఒక ఏడాది పట్టింది. భానుమతి పాత్రలో నటించిన తర్వాత ఇంటికి వెళ్లి గట్టిగా మాట్లాడేదాన్ని. పాత్ర ప్రభావం అలా ఉండేది. భానుమతి పాత్ర, ఫిదా వల్ల చాలా నేర్చుకొన్నాను. చిత్ర యూనిట్ సభ్యులు చాలా సహకారం అందించారు. మొదటి సినిమాకే ఇంతటి రెస్పాన్ రావడంతో మరింత బాధ్యత పెరిగింది.

అలా ఆఫర్ వచ్చింది..

అలా ఆఫర్ వచ్చింది..

జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నాకు ఫిదా ఆఫర్ వచ్చింది. సినిమాల్లో నటించకూడదనే నన్ను మా అమ్మ జార్జియాకు పంపింది. ఎంబీబీఎస్ చేస్తుండగానే మూడో సంవత్సరంలో ప్రేమమ్ సినిమా ఆఫర్ వచ్చింది. అప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. అయితే సెలవుల్లో నటించే విధంగా ప్రేమమ్ దర్శకుడు ఒప్పించాడు. దాంతో ప్రేమమ్‌లో నటించాను.

ఫిదా సక్సెస్ విజయం సమిష్టి

ఫిదా సక్సెస్ విజయం సమిష్టి

సినిమాకు నా ఒక్కరికే క్రెడిట్ ఇవ్వడాన్ని నేను ఒప్పుకొను. చాలా మంది సమిష్టి కృషి వల్ల ఫిదా విజయం సాధించింది. కెమెరామెన్ విజయ్, ఇతర సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. శేఖర్ కమ్ముల బాగా కృషి చేశారు

అప్పుడు భయపడ్డాను..

అప్పుడు భయపడ్డాను..

తెలంగాణ యువతిగా నటించాల్సి వచ్చినప్పుడు నిజంగా భయమేసింది. నా బాడీ ల్వాంగేజ్ సూట్ అవుతుందా అనే అనుమానం వచ్చింది. అయితే నీవు ఎలా ఉంటావో అలానే చేయి అని నమ్మకం కలిగించారు. ఈ చిత్ర విజయంలో శేఖర్ కమ్ముల, రాజు, ఇతర సాంకేతిక నిపుణుల భాగం ఉంది. నేను బాగా నటించానికి తోడ్పాటు అందించిన కాఫీ ఇచ్చే అబ్బాయికి కూడా థ్యాంక్స్.

ఓ కుటుంబంలా మారిపోయాను.

ఓ కుటుంబంలా మారిపోయాను.

ఈ సినిమాలో నటించే వాళ్లందరూ ఓ కుటుంబంలా మారిపోయారు. ముఖ్యంగా నా తండ్రి పాత్ర పోషించిన సాయిచంద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఏడ్చే సీన్లలో నేను నటించేటప్పుడు ఆయన కూడా కంటతడి పెట్టుకొన్నారు. ఆయన ఏడ్చే సీన్లను చూసి నేను కూడా ఏడ్చాను. పాత్రల్లో ఒదిగిపోయాం.

గట్టిగా అనుకొంటే అయిపోతుంది..

గట్టిగా అనుకొంటే అయిపోతుంది..

గట్టిగా అనుకొంటే అయిపోతుంది అనే దానిని నమ్ముతాను. అయితే ఫలితం కోసం వేచి చూడాలి. ఎప్పుడు మంచి గురించి ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. ఢీ షో తర్వాత రెండు మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. అప్పుడు ఎందుకో ఒప్పుకోలేదు. అప్పుడు ఒప్పుకుంటే ఫిదా ఇప్పుడు వచ్చి ఉండేది కాదేమో. దేవుడికి ఎప్పుడు ఎవ్వరికి ఏమీవ్వాలో తెలుసు.

పదిన్నర దాటితే.. నిద్ర వస్తుంది..

పదిన్నర దాటితే.. నిద్ర వస్తుంది..

నాకు ఉదయం 4.30కు లేవడం అలవాటు. అలాగే రాత్రి 10.30 దాటితే నిద్ర వస్తుంది. నిద్రను ఆపుకోలేను. ఒకరోజు పదిన్నర తర్వాత సీన్ చేస్తున్నాం. ఉసిరికాయ తొక్కు తెచ్చే సీన్ చేస్తున్నాం. చాలా చిన్న సీను.. రెండు మూడు డైలాగ్స్ మాత్రమే ఉండేవి. నిద్ర వచ్చింది. దాంతో టేకుల మీద టేకులు తిన్నాం. అప్పుడు నాకు చాలా కష్టమనిపించింది. చాలా గిల్టీగా ఫీలయ్యాను. దానిని తట్టుకోలేక ఏడ్చాను.

నానితో సినిమా చేస్తున్నా..

నానితో సినిమా చేస్తున్నా..

ఒకేసారి ఒకే సినిమాలో నటించాలి అనే రూల్ ఏమీ లేదు. ఇక ముందు వరుస చిత్రాలు చేస్తాను. నాగశౌర్యతో సినిమా ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం ఎంసీఏ చిత్రంలో నాని సరసన నటిస్తున్నాను. ఈ చిత్రానికి శ్రీరాం దర్వకత్వం వహిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే..

సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే..

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా లేను. ఇప్పుడిప్పుడే ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నాను. ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్లలో నేను ఉండటం లేదు. ఎవరైనా తిడుతారేమోనని భయం. ప్రస్తుతం ఫిదా హిట్ అయింది కాబట్టి ఓకే. మరో ఏడాది వరకు అందరూ తిట్టకపోవచ్చు.

English summary
Actor Sai Pallavi get emotional on success of Fidaa. Fidaa running with collections in worldwide. After big success, She speak to Filmibeat Telugu specially. Sai Pallavi said that I was shocked looking at Pawan Kalyans craze.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu