»   » సాయి పల్లవికి పెరుగుతున్న క్రేజ్... 'కణం'పై భారీ అంచనాలు!

సాయి పల్లవికి పెరుగుతున్న క్రేజ్... 'కణం'పై భారీ అంచనాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఊహలు గుసగుసలాడే, కళ్యాణవైభోగమే, జ్యోఅచ్యుతానంద వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో నాగశౌర్య, 'ఫిదా' ఫేం సాయిపల్లవి జంటగా విజయ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కణం'.

ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్స్‌ సన్నాహాలు చేస్తోంది. '2.0' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌షా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.

సాయి పల్లవి

సాయి పల్లవి

మళయాలంలో ‘ప్రేమమ్' , తెలుగులో ‘ఫిదా' చిత్రాల తర్వాత సాయి పల్లవికి క్రేజ్ ఒక్కసారిగా బాగా పెరిగి పోయింది. ఆమెతో సినిమాలు తీయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు క్యూ కడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఆమె సౌత్ స్టార్ హీరోయిన్ అయ్యేలా ఉంది.

కణం

కణం

తొలినాళ్లలో లవర్ బాయ్ ఇమేజ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేసిన నాగ శౌర్య ‘కణం' సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగశౌర్య, సాయిపల్లవి, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

హారర్ థ్రిల్లర్

హారర్ థ్రిల్లర్

‘కణం' మూవీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది. సాయి పల్లవి క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతుందని సమాచారం.

తారాగణం

తారాగణం

ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.

English summary
Lyca Productions, which is bankrolling Rajinikanth-Shankar's '2.0', has produced a Telugu-Tamil bilingual starring Sai Pallavi. While the Tamil title, 'Karu' and film's first look were unveiled a few months ago, the Telugu title has been announced now, and its 'Kanam'. Naga Shourya is playing the male lead in this horror thriller revolving around Pallavi's character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu