Sai Pallavi ఫ్యాన్స్‌కు శుభవార్త.. రిలీజ్ డేట్ కంటే ముందే థియేటర్లలోకి.. !
టాలీవుడ్ భళ్లాలదేవ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం విరాట పర్వం సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు. దేశంలోని అత్యంత టాలెంటెడ్ యాక్టర్లు నటించిన ఈ చిత్రాన్ని ముందస్తుగా జూలై 1వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సినిమా తేదీని నిర్ణయించిన డేట్ కంటే ముందుగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. విరాటపర్వం సినిమాను జూన్ 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రాంతంలో జరిగిన
1990లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా విరాటపర్వం తెరకెక్కింది. ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న అలియాస్ అరణ్యగా రానా దగ్గుబాటి నటించారు. కామ్రేడ్ రవన్నను ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించే వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటించింది.

నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌గా ప్రేమకథ
తెలంగాణ ప్రాంతంలో కొనసాగిన నక్సల్ మూమెంట్ నేపథ్యంగా అద్బుతమైన అనుభూతికి లోను చేసే ప్రేమ కథగా విరాటపర్వం సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

సాయి పల్లవి ఫ్యాన్స్ ఫిదా
విరాట పర్వం సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజైన మోషన్ పోస్టర్లు, టీజర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకోవడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా చేపట్టేందుకు సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ముందుకు జరిపి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నేపథ్యంలో సాయి పల్లవి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

విరాట పర్వం ప్రత్యేకత ఇదే..
శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత సాయిపల్లవి నటించిన సినిమా విరాట పర్వం కావడం, అలాగే నీది నాది ఒకే కథ భారీ విజయం తర్వాత వేణు ఊడుగుల రూపొందించిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి ఆనంద చక్రపాణి తదితరులు
దర్శకత్వం, కథ: వేణు ఊడుగుల
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
సమర్పణ: సురేష్ బాబు
సినిమాటోగ్రఫి: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
స్టంట్స్: స్టెఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్స్
కొరియోగ్రఫి: రాజు సుందరం
పబ్లిసిటీ డిజైన్స్: ధని ఏలే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
రిలీజ్ డేట్: 2022-06-17


Click it and Unblock the Notifications











