For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Love Story మూవీకి ఆ సంఘటనే స్పూర్తి.. ఆడపిల్లలకు ఇంటా బయటా అంటూ. సాయిపల్లవి ఎమోషనల్

  |

  సంచలన విజయం సాధించిన ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన లవ్ స్టోరి చిత్రం పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ సినిమా తొలి రోజు రికార్డుస్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. రెండో రోజు కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో లవ్ స్టోరి టీమ్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకొన్నది. ఈ సక్సెస్ మీట్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా లవ్ స్టోరి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. నిర్మాత సునీల్ నారంగ్ కేక్ కట్ చేసి సాయిపల్లవి, నాగచైతన్యకు తినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

  లవ్ స్టోరి సక్సెస్ మీట్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కాలంలో ఎన్నో కష్టాలు పడి లవ్ స్టోరి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మేము పడిన కష్టానికి అనుగుణంగా ప్రేక్షకులు మా సినిమాకు గొప్ప విజయాన్ని అందించారు. ఈ విజయం గురించి వస్తున్న స్పందనను వింటుంటే మాటలు రావడం లేదు. ప్రేక్షక దేవుళ్లకు మా టీమ్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అని శేఖర్ కమ్ములు తెలిపారు.

  Sai Pallavi, Shekhar Kammula emotinal at Love Story success meet

  కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య తెరకెక్కించిన ఈ కథను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత సొసైటీకి మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా చేయాలని అనుకున్నాను. ఆ క్రమంలో స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ధీర నువ్వే ధీర అనే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ సందర్భంగా ఇంటిలో, బయటా ఇబ్బందులకు గురయ్యే అమ్మాయిలను నిర్భయంగా మాట్లాడమని చెప్పాం. అప్పుడే సినిమా కథకు స్పూర్తి లభించింది అని శేఖర్ కమ్ముల తెలిపారు.

  క్లిష్టమైన, సున్నితమైన అంశాల ఆధారంగా లవ్ స్టోరి కథను తెరకెక్కించడం కత్తి మీద సాము. అలాంటి కథను బాగా చూపించామని చెబుతుండటం సంతోషంగా ఉంది. తాము పడుతున్న ఇబ్బందులను ఒక ఆడపిల్ల బయటకు చెప్పుకోగలిగే ధైర్యం ఈ సినిమా చూసి తెచ్చుకుంటే, వివక్షకు గురైన ఒక ఊరి అబ్బాయి ఇది నా కథ అని రిలేట్ చేసుకుంటే మేము ఇంకా ఎక్కువ సక్సెస్ అయినట్లు భావిస్తాను. నా సినిమాల మీద ఉన్న నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్. నాగ చైతన్య, సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ లో లీనమై సహజంగా నటించారు. మా యూనిట్ లోని ప్రతి ఒక్కరికి లవ్ స్టోరి సక్సెస్ పట్ల థాంక్స్ చెప్పుకుంటున్నాను అని శేఖర్ కమ్ముల అన్నారు.

  Sai Pallavi, Shekhar Kammula emotinal at Love Story success meet

  సక్సెస్ మీట్‌లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు ఏ మేరకు వస్తారని రిలీజ్‌కు ముందు భయపడ్డాం. కానీ థియేటర్ల వద్ద ప్రేక్షకులను చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది. లవ్ స్టోరి చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన సమస్యలు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. లవ్ స్టోరి సినిమా థియేటర్ లలో చూడాల్సిన సినిమా. తప్పకుండా థియేటర్లకు రండి మీరు మూవీని ఎంజాయ్ చేస్తారు. లవ్ స్టోరి చిత్రానికి పనిచేసిన టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు అని అన్నారు.

  హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ మా సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. దక్షిణాదికి చెందిన స్టార్ హీరోలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతీ ఒక్కరు ట్వీట్లు చేసి సపోర్ట్ చేశారు. సినిమాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాను. లవ్ స్టోరి చిత్రంలో సమాజంలో, మన ఇంట్లో జరిగే అవకాశమున్న సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లకు ఇంట్లో, బయటా ఇబ్బందిగా ఉంటే మీరు తప్పకుండా అడగాలి. అలాంటి మార్పు లవ్ స్టోరి చూశాక వస్తే మేము సంతోషిస్తాము. సొసైటీకి ఉపయోగపడే ఈ పాయింట్స్‌ను టచ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల అభినందించాలి అని అన్నారు.

  English summary
  Love story movie getting good response at box office. In this occasion, Team celebrated success.In event, Sai Pallavi, Shekhar Kammula emotinal at Love Story success meet
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X