దర్శకుడిగా మారుతున్న పూరీ జగన్నాథ్ సోదరుడు..
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అడుగు జాడల్లో ఆయన సోదరుడు నడబోతున్నాడు. ఇప్పటి వరకు హీరోగా సుపరిచితులైన సాయిరాం శంకర్ దర్శకత్వం బాధ్యతలను చెపట్టబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఆయన వెల్లడించలేదు.
గత 15 ఏళ్లలో సాయిరాం శంకర్ దాదాపు 12 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వాడు నేను కాదు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్నది. హీరోగా తనదైన ముద్ర వేసుకొన్న సాయి దర్శకుడిగా పేరుతెచ్చుకొంటారని ఆశిద్దాం.



Click it and Unblock the Notifications











