For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆమెపైనే క్రష్.. చిన్న వయసులోనే తప్పు చేశా: పర్సనల్ సీక్రెట్ లీక్ చేసి షాకిచ్చిన బెల్లంకొండ సాయి

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవగా.. మరికొందరు మాత్రం సరైన బ్రేక్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో బెల్లంకొండ వారి అబ్బాయి సాయి శ్రీనివాస్ ఒకడు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. హిట్ కోసం పరితపిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సినిమాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ సీక్రెట్ ఒకటి లీక్ చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అల్లుడు శ్రీనుతో ఎంట్రీ.. నిరాశ పరిచినా

  అల్లుడు శ్రీనుతో ఎంట్రీ.. నిరాశ పరిచినా

  బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా సినిమాల్లోకి ప్రవేశించాడు సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శ్రీను'తో హీరోగా ఎంటరైన అతడు.. హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడు చేసిన ‘స్పీడున్నోడు', ‘కవచం', ‘సీత', ‘సాక్ష్యం' వంటి చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.

  వాటిలో మాత్రం అస్సలు తగ్గని హీరోగా

  వాటిలో మాత్రం అస్సలు తగ్గని హీరోగా

  సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రతి దాన్ని ఎంతో రిచ్‌గా ప్లాన్ చేసుకుంటాడు బెల్లంకొండ వారి అబ్బాయి సాయి శ్రీనివాస్. అతడి మొదటి చిత్రంలోనే స్టార్ హీరోయిన్ సమంతతో జత కట్టడంతో పాటు తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించాడు. ఆ తర్వాత పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అనుపమా పరమేశ్వర్ వంటి బడా హీరోయిన్లతోనే నటించాడీ యంగ్ హీరో.

  నాగ్ హీరోయిన్ అందాల ఆరబోత.. మళ్లీ తెరపైన మెరిసిన తార

  Gandharva Movie Launch Opening Part 2 | Actor Sandy Speech
  కెరీర్‌లోనే బిగ్ హిట్.. రెట్టించిన ఉత్సాహం

  కెరీర్‌లోనే బిగ్ హిట్.. రెట్టించిన ఉత్సాహం

  దాదాపు ఆరేళ్లుగా హీరోగా కొనసాగుతోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు రెండు చిత్రాలు మాత్రం లాభలను తెచ్చి పెట్టాయి. అందులో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘జయ జానకీ నాయక' ఒకటి. ఇక, రెండోది అతడి గత చిత్రం ‘రాక్షసుడు'. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లనూ రాబట్టింది. అలాగే, నటుడిగానూ పేరు తెచ్చింది.

  మరోసారి ‘అల్లుడు' టైటిల్‌తో వస్తున్నాడు

  మరోసారి ‘అల్లుడు' టైటిల్‌తో వస్తున్నాడు

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రమణ్యం నిర్మిస్తోన్న ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే, రియల్ హీరో సోనూ సూద్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఇది విడుదల కానుంది.

  పర్సనల్ సీక్రెట్ లీక్ చేసి షాకిచ్చిన సాయి

  పర్సనల్ సీక్రెట్ లీక్ చేసి షాకిచ్చిన సాయి

  మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల కాబోతుండడంతో ‘అల్లుడు అదుర్స్' టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అంతేకాదు, తన జీవితంలోని కొన్ని రహస్యాలను బయట పెట్టి షాకిచ్చాడీ యంగ్ హీరో.

  శృంగారం ఒలకబోస్తున్న యువ హీరోయిన్.. లేటేస్ట్ ఫోటోషూట్‌తో హంగామా

  ఆమెపైనే క్రష్.. పదహారేళ్లకే తప్పు చేశా

  ఆమెపైనే క్రష్.. పదహారేళ్లకే తప్పు చేశా

  ఈ ఇంటర్వ్యూలో తన మొట్టమొదటి క్రష్ ఆరో తరగతిలో ఓ అమ్మాయి అని రివీల్ చేశాడు సాయి శ్రీనివాస్. అలాగే, తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెబుతూ.. ‘నేను పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు మందు తాగాను. అది తెలిసి మా నాన్న నాతో వారం రోజులు మాట్లాడలేదు. అప్పుడు నా తప్పు తెలుసుకుని.. మళ్లీ అలా చేయలేదు' అని చెప్పుకొచ్చాడు.

  English summary
  Bellamkonda Sai Sreenivas is an Indian actor who works Telugu films. He made his debut with Alludu Seenu (2014) opposite Samantha Ruth Prabhu along with Prakash Raj. He is the son of Telugu film producer Bellamkonda Suresh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X