»   » క్రికెట్ ఆడుతుంటే దొరికాడట.. చిరంజీవి మేనల్లుడు అనే సంగతే తెలియదు!

క్రికెట్ ఆడుతుంటే దొరికాడట.. చిరంజీవి మేనల్లుడు అనే సంగతే తెలియదు!

Subscribe to Filmibeat Telugu

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్నాడు. ఆరంభంలో తేజు వరుస హిట్లు అందుకున్నాడు. కానీ ఇటీవల ఈ మెగా హీరోకు అంతగా కలసి రావడం లేదు. తేజు నటించిన వరుస చిత్రాలు పరాజయం చెందుతూ వచ్చాయి. కానీ అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న తేజు కెరీర్ పరంగా కూడా రాణిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తేజు ఆసక్తికర విషయాలని వెల్లడించాడు. తన తొలి చిత్రం రేయ్ లో అవకాశం ఇచ్చిన వైవిఎస్ చౌదరికి తాను చిరంజీవి మేనల్లుడిననే విషయమే తెలియదని తేజు తెలిపాడు.

Sai Dharam Tej Faced Bad Situations
 రేయ్ చిత్రంతో ఎంట్రీ కానీ

రేయ్ చిత్రంతో ఎంట్రీ కానీ

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎవరైనా చిరంజీవి ఆశీస్సులు ఉంటాయి. కానీ సాయిధరమ్ తేజ్ ఎవరో తెలియకుండానే వైవిఎస్ చౌదరి తేజుకు తొలి చిత్రంలో అవకాశం ఇచ్చాడట. ఈ విషయాన్ని తేజు ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు.

 క్రికెట్ ఆడుతుండగా

క్రికెట్ ఆడుతుండగా

తాను మనోజ్ వాళ్ళ ఇంట్లో క్రికెట్ ఆడుతుండగా వైవిఎస్ చౌదరి చూశారు. తనని దగ్గరకు పిలిచి నా సినిమాలో నటిస్తావా అని అడిగినట్లు తేజు తెలిపాడు. ఆ తరువాతే తాను చిరంజీవి మేనల్లుడిని అనే విషయం ఆయనకు చెప్పినట్లు తేజు వివరించాడు.

 ఆయన ఆశీస్సులు ఉంటే చాలు

ఆయన ఆశీస్సులు ఉంటే చాలు

నాకు అవకాశాలు కావాలంటే చిరంజీవి గారి పేరు ఉపయోగించుకుంటే సరిపోతుంది. కానీ ఆయన ఆశీస్సులు మాత్రం ఉంటె చాలు అని నేను భావించానని తేజు అన్నాడు.

చిరు, పవన్ ప్రస్తావన ఎక్కువగా

చిరు, పవన్ ప్రస్తావన ఎక్కువగా

తేజు చిత్రాలలో చిరు, పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తేజు ఇప్పటికే రెండు మూడు మెగాస్టార్ పాటలని రీమేక్ చేశారు. సందర్భం వచ్చిన ప్రతి సారి వారిపై అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు.

English summary
Saidharam Tej reveals how he get first movie opportunity. Director YVS Chowdary asks Saidharam Tej while playing cricket.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu