»   » "ఎప్పుడు రా పెళ్ళి" అని నన్నే అన్నట్టుంది.? అరకురోడ్ లో ప్రభాస్ ప్రశ్న

"ఎప్పుడు రా పెళ్ళి" అని నన్నే అన్నట్టుంది.? అరకురోడ్ లో ప్రభాస్ ప్రశ్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో సక్సెస్‌ లేకపోతే తన పేరును న్యూమరాలజీ ప్రకారం కొత్త కొత్త అక్షరాలు జత చేయడం జరుగుతుంది. మరికొందరైతే ఏకంగా పేరే మార్చుసుకుంటారు. ఇంకొందరు పేరును కుదిస్తుంటారు. తాజాగా పూరీ జగన్నాథ్‌ సోదరుడు సాయిరామ్‌ శంకర్‌ తన పేరును కుదించేశారు. పేరులో సాయిను తీసేసి రామ్‌ శంకర్‌గా మార్చుకున్నాడు. దీనితోనైనా ఈసారి హిట్‌ కొట్టాలని ఆశపడుతున్నారు.

'డేంజర్‌' సినిమాలో చలాకీగా నటించిన 'నేనింతే'లో హీరో ఫ్యాన్‌గా నటించిన సాయిరామ్‌శంకర్‌.. ఆ తర్వాత హీరోగా చేసిన ఏ చిత్రమూ ఆయనకు గుర్తింపుతేలేదు. తాజాగా ఆయన 'అరకు రోడ్‌‌లో' అనే సినిమాలో నటిస్తున్నాడు. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించాడు. ఎవరూ ఊహించనత వెరైటీ గా... సినంపుల్గా జరిగిందీ ప్రోగ్రాం.... అదెలా అంటే ఈ ఫొటోలు చూదండి.

అరకురోడ్‌లో:

అరకురోడ్‌లో:

రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'అరకురోడ్‌లో'.

బల్‌ స్టార్‌ ప్రభాస్‌:

బల్‌ స్టార్‌ ప్రభాస్‌:

ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్ర సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించారు.

ఎప్పుడురా పెళ్లి:

ఎప్పుడురా పెళ్లి:

ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ..'ఎప్పుడురా పెళ్లి..' అనే ఈ సాంగ్‌ నా గురించే రాసినట్లుంది. లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్‌ చాలా వెరైటీగా ఉంది. సహజంగా పూరీ గారు తన సినిమాలలో ట్యూన్స్‌, లిరిక్స్‌ ఆయనే రాస్తుంటారు.

పూలాగే:

పూలాగే:

అలాగే ఈ చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌లా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్‌ అదిరిపోయింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.

గెడ్డం తెల్లబడి పోతావుందే:

గెడ్డం తెల్లబడి పోతావుందే:

చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ మాట్లాడుతూ..'గెడ్డం తెల్లబడి పోతావుందే..' అనే లిరిక్‌తో సాగే సాంగ్‌ టీజర్‌ను మా కోరిక మేరకు బాహుబలి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గారు ఫిల్మ్‌ సిటీలోని బాహుబలి సెట్‌లో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది.

షూటింగ్‌ మొత్తం పూర్తయింది:

షూటింగ్‌ మొత్తం పూర్తయింది:

ఈ సందర్భంగా మా టీమ్‌ అందరి తరుపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పాటని నేను, రామాంజనేయులు కలిసి రాయడం జరిగింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ మొత్తం పూర్తయింది.

ఆడియో విడుదల:

ఆడియో విడుదల:

సెప్టెంబర్‌ 10న సినీ ప్రముఖుల సమక్షంలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో ఆవిష్కరణ జరుపనున్నాం. పూరీ సంగీత్‌ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదలకానున్నాయి...అని అన్నారు.

వీళ్ళంతా ఉనారు:

వీళ్ళంతా ఉనారు:

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రామ్‌శంకర్‌, నిర్మాత మేకా బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
రామ్‌శంకర్‌, నిఖిషా పటేల్‌, కమల్‌ కామరాజు, అభిమన్యు సింగ్‌, కోవై సరళ, థర్టీ ఇయర్స్‌ ఫృథ్వీ, కృష్ణ భగవాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

సాంకేతిక బృందం కూదా:

సాంకేతిక బృందం కూదా:

సాహిత్యం: వాసుదేవ్‌, రామాంజనేయులు; ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, సంగీతం:వాసుదేవ్‌, రాహుల్‌రాజ్‌; డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి, నిర్మాతలు: మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం: వాసుదేవ్‌.

English summary
Sairam Shankar's 'Araku Road Lo' Movie Song Teaser Released by the Young rebel star Prabhas at Ramoji filim city
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu