»   » వాడు నేను కాదు... అంటున్న పూరి జగన్నాథ్ సోదరుడు!

వాడు నేను కాదు... అంటున్న పూరి జగన్నాథ్ సోదరుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్..... టాలీవుడ్లో చాలా కాలంగా హీరోగా నిలదొక్కుకునేందుకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కెరీర్లో ఆయనకు చెప్పుకోదగ్గ సినిమాలు రెండే రెండు. ఒకటి ‘143', మరొకటి ‘బంపరాఫర్'. ఇవి భారీ హిట్లు కాక పోయినా...సాయిరాం శంకర్ అనే వాడు ఇండస్ట్రీలో ఉన్నాడు అనే గుర్తింపు మాత్రం అతనికి తెచ్చి పెట్టాయి.

సాయిరాం శంకర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్లవుతోంది. 143 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లవుతోంది. 2009లో వచ్చిన ‘బంపర్ ఆఫర్' హిట్టు అనేదే లేదు. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసినా నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి. చివరగా 2014లో వచ్చి రోమియో పెద్ద ప్లాప్.

Sairam Shankar's Vaadu Nenu Kaadhu movie details

హిట్టు సినిమాలు లేకుంటే అవకాశాలు రావడం కష్టమే. సాయి ప్రస్తుతం సాయిరాం శంకర్ ఈ రెండేళ్ల గ్యాపులో ఎలాగో అలా రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘వాడు నేను కాదు', ‘అరకు రోడ్డులో' చిత్రాల్లో నటిస్తున్నాడు. అరకు, విశాఖ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమాల షూటింగ్ జరుగుతోంది. ‘వాడు నేను కాదు' సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

మరో రెండు మూడూ సినిమాలు హీరోగా ట్రై చేసి.... ఇక దర్శకత్వం వైపు మళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు సాయిరాం శంకర్. సినిమా రంగంలో నేనేంటో నిరూపించుకుంటాను అంటూ నమ్మకంగా చెబుతున్నాడు. ఇప్పటికే చాలా ఏళ్లు గడిపోయాయి. ఇంకా ఎప్పుడు నిరూపించుకుంటాడో ఏంటో?

English summary
Vaadu Nenu Kaadhu is an upcoming Telugu legal thriller film directed by Vinod Vijayyan. The film stars starring Sairam Shankar in the lead role as a public prosecutor. Acclaimed cinematographer Rajeev Ravi wields the camera, Vivek Harshan handles the editing, while award winning composer Rahul Raj composes the film's original songs and original background score.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu