twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ టిక్కెట్ల వివాదానికి త్వరలోనే పరిష్కారం... అసలది వివాదమే కాదు, పవన్ సినిమాల మీద సజ్జల సంచలన వ్యాఖ్యలు!

    |

    ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల అంశం కొద్ది రోజులుగా దుమారం రేపుతోంది. టికెట్ రేట్ల తగ్గింపు పై ఇప్పటికే పేర్ని నాని- రామ్ గోపాల్ వర్మ మధ్య మాటల యుద్ధం జరగగా ఎట్టకేలకు ప్రస్తుతానికి అయితే బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా ఈ అంశం మీద ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

     పేర్ని నానిని ఉద్దేశిస్తూ

    పేర్ని నానిని ఉద్దేశిస్తూ

    ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాని సహా చాలా మంది ఈ నిర్ణయంపై స్పందించారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి ఈ విషయంలో రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేస్తున్న క్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ టార్గెట్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు.

    వర్మ ట్వీట్ కు పేర్ని నాని రిప్లై

    వర్మ ట్వీట్ కు పేర్ని నాని రిప్లై

    పేర్ని నాని నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యలకి సంబంధించిన వివరణ ఇస్తానని, అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ కు పేర్ని నాని రిప్లై ఇచ్చారు. 'ధన్యవాదాలు వర్మ గారు. తప్పకుండా త్వరలో కలుద్దాం' అని కూడా ఆయన సమాధానమిచ్చారు.

    అర్థం కావడం లేదు

    అర్థం కావడం లేదు

    ఇక ఇప్పటికే టికెట్ల అంశం ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు. పేదలకు వినోదం అందుబాటులోకి తెస్తున్నామని, అయినా కొంతమంది విమర్శిస్తున్నారని అన్నారు. ఇప్పుడు తాజాగా సినిమా టిక్కెట్ల వివాదం ఏమిటో అర్థం కావడం లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన టిక్కెట్ల అంశంపైనా స్పందించారు.

    నిర్ణయం తీసుకోలేదు

    నిర్ణయం తీసుకోలేదు

    అసలు ఈ సినిమా టికెట్ల అంశంలో వివాదం ఏముందని సజ్జల ప్రశ్నించారు. టిక్కెట్ల వివాదం ఇంకా ముదురుతుందని అనుకోవడం లేదని.. త్వరలోనే ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేసి తాము టిక్కెట్ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

    త్వరలోనే పరిష్కారం

    త్వరలోనే పరిష్కారం

    పవన్ కల్యాణ్ ఏడాదికో ఒకటో రెండో సినిమా చేస్తారని, అలా అని ఆయన సినిమా యాబై లేదా వంద లేదా రెండు వందల కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తాయని పేర్కొన్నారు. దాని కోసం ప్రత్యేకంగా రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని సజ్జల అన్నారు. సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో కమిటీ వేశామని.. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. పెట్టిన పెట్టు బడులు అన్నీ వారం రోజుల్లో రాబట్టుకోవాలని సినీ నిర్మాతలు చూస్తున్నారని సజ్జల ఈ క్రమంలో విమర్శించారు. ఏపీ ప్రభుత్వం మీద రామ్ గోపాల్ వర్మ చేస్తున్న విమర్శలు గురించి కూడా సజ్జల స్పందించారు. ఆయన చేస్తున్న కామెంట్లు కార్టూన్లు వేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

    English summary
    Sajjala RamaKrishna reddy made comments about the AP Movie ticket issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X