»   » రికార్డు ధరకు సాక్ష్యం శాటిలైట్.. హిందీ హక్కులకే దిమ్మతిరిగింది..

రికార్డు ధరకు సాక్ష్యం శాటిలైట్.. హిందీ హక్కులకే దిమ్మతిరిగింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు శ్రీవాస్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న "సాక్ష్యం" తాజా షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడం పరిశ్రమలో సంచలనం రేపింది.

 13.5 కోట్లకు శాటిలైట్ హక్కులు

13.5 కోట్లకు శాటిలైట్ హక్కులు

సాక్ష్యం చిత్రం శాటిలైట్ హక్కులు (తెలుగు, హిందీ) 13.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం మార్కెట్‌లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. జీ సంస్థ "సాక్ష్యం" తెలుగు శాటిలైట్ హక్కుల్ని తెలుగు-5.5 కోట్లు, హిందీ-8 కోట్ల రూపాయలకు కొనడం విశేషం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ కు కూడా విశేషమైన స్పందన లభించింది.

భారీ బడ్జెట్‌తో సాక్ష్యం

భారీ బడ్జెట్‌తో సాక్ష్యం

ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్స్ వేసి షూటింగ్ జరుగుతోంది. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీపడకుండా అభినేష్ నామా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఓ యువ హీరో చిత్రానికి ఈస్థాయిలో శాటిలైట్ బిజినెస్ జరగడం అనేది ఇదే మొదటిసారి.

 మే 11న విడుదల

మే 11న విడుదల

చిత్రబృందం ఆఖరి షెడ్యూల్ కోసం త్వరలో అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో చిత్రించబోయే కీలక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తవుతుంది. మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనున్న "సాక్ష్యం" ష్యూర్ షాట్ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

 నటీనటులు, సాంకేతికవర్గం

నటీనటులు, సాంకేతికవర్గం

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

English summary
Bellamkonda Suresh’s son Bellamkonda Srinivas made a name for himself in the Tollywood trade by working with A list directors like Vinayaka and Boyapati Srinu. Srinivas's upcoming film Sakshyam with director Sriwaas has been fetching lucrative deals for its makers. Its Hindi dubbing rights were recently sold for a whopping Rs. 8 crore and the satellite rights of the film were now bagged by Zee Network for a handsome Rs. 5.5 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu