»   » సల్మాన్ ఒక చిచోరా, ఇమ్రాన్ ముద్దుతో క్యాన్సర్ వస్తుంది: పాకిస్తాన్ నటి "అతి" మాటలు

సల్మాన్ ఒక చిచోరా, ఇమ్రాన్ ముద్దుతో క్యాన్సర్ వస్తుంది: పాకిస్తాన్ నటి "అతి" మాటలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత్-పాకిస్థాన్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అటు బార్డర్లో ఎప్పుడు చూసిన ఉద్రిక్త పరిస్థితి...రాజకీయంగా ఎన్నో వివాదలు. అయితే సినిమా రంగానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పలువురు పాకిస్తాన్ స్టార్స్ బాలీవుడ్లో పాగా వేయడానికి క్యూ కడుతున్నారు. ఇక్కడ ఉండే అవకాశాలూ, భారీ రెమ్యున రేషన్లూ వాళ్ళని ఇక్కడైకి వచ్చేలా ఆకర్షిస్తున్నాయన్నది ఒప్పుకోవాల్సిన నిజం.

కళాకారులకి ప్రాంతీయ తత్వాలని అంటగట్తటం సరికాదనుకున్నా వారు చేసే వ్యాఖ్యలు మరీ ఎక్కువ అయినట్టుగా అనిపించిన ఘటనలూ ఉన్నాయి. తాజా గా పాక్‌నటి సబాకమర్ సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ షాక్ అయ్యే వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ ఒక "చిచోరా" (చిల్లర మనిషి) అంటూ అనటం ఇప్పుడు మరీ హట్ టాపిక్ అయిపోయింది. సల్మాన్ ఖాన్ తో కలసి నటించనని అతడొక చీప్ నటుడని వ్యాఖ్యానించింది. అతనికి అసలు స్టైల్ తెలియదని అభిమానులు మండి పడే వ్యాఖ్యలు చేసింది. పిలిచి మరీ చాన్స్ ఇస్తే అసలు ఒక బాలీవుడ్ హీరో సినిమాలో నటించటం తనకు ఇష్టం లేదంటూ కాస్త అతి చేసింది..

Salman a 'chhichhora', don't want 'oral cancer' from Emraan: Pak actress Saba


హష్మీతో కూడా కలిసి నటించనని చెప్పిన ఆమె.. అతడిని ముద్దు పెట్టుకుంటే మౌత్ కేన్సర్ వస్తుందని పేర్కొంది. బాలీవుడ్ సినిమాల్లో పాక్ నటులను తీసుకోకూడదంటూ మహారాష్ట్రలో చర్చ నడుస్తున్న వేళ... సబా కమర్ వ్యాఖ్యలు బాలీవుడ్ సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 'హిందీ మీడియం' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కి వచ్చిన పాకిస్తానీ నటి సబా కమర్‌, సల్మాన్‌ఖాన్‌ మీదనే కాకుండా ఇంకో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి కూడా విమర్శలు చేసింది.

అతనితో కలిసి నటించమని ఎవరైనా అడిగితే ఒప్పుకోనని చెప్పింది. ఇమ్రాన్‌ హష్మీని ముద్దు పెట్టుకుంటే నోటి క్యాన్సర్‌ వస్తుందని కూడా విపరీత వ్యాఖ్యలు చేసింది సబా కమర్‌. అయితే ఇమ్రాన్‌ హష్మీతోగానీ సల్మాన్‌ఖాన్‌తోగానీ నటించేంత సీన్‌ సబా కమర్‌కి లేదు. అసలు ఇప్పుడిప్పుడే చాన్స్ ల కోసం వెతుక్కుంటున్న సభాకమర్ ఇలా మాట్లాడటం ఇక్కడకు వచ్చే పాక్ నటులను మరింత ఇబ్బందులకు గురిచేసేలా ఉంది. అయితే ఇప్పటివరకూ సభా వ్యాఖ్యల మీద ఇతర పాక్ నటుల స్పందన మాత్రం కనిపించలేదు.

English summary
A shocking interview of Saba Qamar has gone viral on the social media in which the 32-year-old Pakistani star is calling Bollywood superstar ‘chichora’ (cheap) while ridiculing other actors like Hrithik Roshan, Ranbir Kapoor, Riteish Deshmukh and Emraan Hashmi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu