»   »  నేనూ సల్మాన్ ప్రేమలో ఉన్నాం... అదొక్కటే మిగిలిందిక

నేనూ సల్మాన్ ప్రేమలో ఉన్నాం... అదొక్కటే మిగిలిందిక

Written By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ల మధ్య అసలు విభేదాలున్నాయా అని జనం అనుకునేంత గా మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఖాన్లిద్దరూ ఒకళ్లనొకళ్ళు పొగిడేసుకుంటూ ఓ ప్రేమ కురిపించేసుకుంటున్నారు. చాలా కాలంగా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్న సంగతి మనకు తెలిసిందే. మధ్య మధ్యలో కలుసుకోవటం మళ్ళీ ఒకరిమీద ఒకరు సెటైర్లు వేసుకోవటం మామూలైపోయింది. 2008లో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ జన్మదిన వేడుకల్లో వీరిద్దరూ గొడవ పడ్డారు.

salman- sharukh

తన దస్ కా దమ్ గేమ్ షోకు సల్మాన్ షారూఖ్ ఖాన్ ను ఆహ్వానించాడు. అందుకు షారూఖ్ అంగీకరించాడు కూడా . అదే సమయంలో షారూఖ్ ఖాన్ తన ప్రియ మిత్రుడు సల్మాన్ ను కళాశాల ఉత్సవానికి ఆహ్వానించాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం వికసించి మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని భావించారు. కానీ ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకరినొకరు మాటలతో పోక్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే కొంత కాలం గా కాస్త నెమ్మదించినట్టే ఉన్నారు ఈ ఖాన్ ద్వయం. ఇక మూడో ఖాన్ అయిన అమీర్ కూడా అన్ని గొడవలనీ లైట్ తీసుకుని సైలెంట్ గానే ఉంటున్నాడు.

ఇక షారూఖ్ అయితే సల్మాన్ తో ఉన్న అనుబందం గురించి బాగానే చెప్తున్నాడు "నేను సల్మాన్‌ కలిసి ఉన్నప్పుడు చూసినవారెవరైనా ఇద్దరికీ సంబంధం ఉందనుకుంటారు. మేము రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని అనుకుంటారు. నాకు కావాల్సిందీ అదే. నేను సల్మాన్‌ ప్రేమించుకుంటున్నాం అనేదే మా ఇద్దరి మధ్య ఆఖరి పుకారు కావాలి. ఎందుకంటే మా గురించి అన్నీ చెప్పేశారు, వినేశారు. ఇక మిగిలింది ఈ ఒక్కమాటే" అని అన్నాడు సల్మాన్, ఆమీర్ లతో అనుబంధం గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలువెల్లడించాడు షారుక్.

salman- sharukh

'నేను, సల్మాన్‌, ఆమిర్‌ కలిసినప్పుడు ఎప్పుడూ కూడా ఈ సినిమాలూ స్టార్‌డంల గురించీ స్టేతస్ ల గురించీ మాట్లాడుకోం. చెప్పాలంటే ముగ్గురూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపైనే చర్చించుకుంటాం. ఓసారి నేను నా కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌తో సల్మాన్‌ని కలవాలని వెళ్లాను. సల్మాన్‌ నన్ను చూసి 'మనం చాలా లక్కీ అని అన్నాడు. దేవుడు మనకు చాలా ఇచ్చాడు. ఈ వయసులో మరొకరైతే రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచించేవారు. కానీ మనం చాలా అదృష్టవంతులం. పద ఓ డ్రింక్ లాగించేద్దాం' అన్నాడు అంటూ చెప్పాడు షారూఖ్. సల్మాన్‌ అలా ఎందుకు అన్నాడో తెలీదుకానీ అతని మాటలు వింటుంటే ఇద్దరికీ ఒకే రకమైన ఆలోచనలున్నాయనిపించిందట షారుక్ కు. అందుకే తామిద్దరం ప్రేమలో పడ్డామన్న పుకారు వస్తే బాగుంటుందనిపిస్తోందని ఆశపడుతున్నాడట.

English summary
The actor was candour and wit personified while speaking about his fellow superstars and good friends Salman and Aamir.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu