»   » హాట్ న్యూస్ : సల్మాన్ వాయిస్ కి రామ్ చరణ్ డబ్బింగ్

హాట్ న్యూస్ : సల్మాన్ వాయిస్ కి రామ్ చరణ్ డబ్బింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్ చరణ్ త్వరలో సల్మాన్ ఖాన్ కు డబ్బింగ్ చెప్పబోతున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. వీరిద్దరికీ ఉన్న అనుబంధంతో సల్మాన్ తాజా చిత్రం తెలుగు వెర్షన్ కు రామ్ చరణ్ చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఈ విషయమై సల్మాన్ స్వయంగా ఫోన్ చేసి అడగటంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొదటి నుంచీ సల్మాన్ ఖాన్ కుటుంబానికి ,చిరంజీవి కుటుంబానికి అనుబంధం ఉంది. దాంతో వెంటనే రామ్ చరణ్ ఆలోచించకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు రాజశ్రీ బ్యానర్ లో సల్మాన్ హీరోగా రూపొందుతున్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' .

ఈ డబ్బింగ్ గురువారం అంటే విజయదశమి రోజు నుంచి ప్రారంభం కా నుంది. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ఈ డబ్బింగ్ కు రెడీ చేస్తున్నారు. తెలుగులోనూ భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ డబ్బింగ్ చెప్తూండటంతో ఖచ్చితంగా సినిమాకు హైప్ క్రియేట్ అవుతుంది. అందులోనూ ఇదే బ్యానర్, హీరో కాంబినేషన్ లో గతంలో వచ్చిన ... ప్రేమ పావురాలు, ప్రేమాలయం చిత్రాలు భాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసాయి. ఇప్పుడు కూడా అలాంటి మ్యాజిక్ జరగబోతోందని వినికిడి.

Salman is revealed to have called Charan personally for the dubbing

ఇక ...సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటిస్తున్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రంలోని ఓ కొత్త గీతం విడుదలైంది. సోనమ్‌ కపూర్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ చిత్రానికి సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్‌, సోనమ్‌లతోపాటు అనుపమ్‌ ఖేర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.

బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

గతంలో సల్మాన్‌ఖాన్‌తో దర్శకుడు సూరజ్‌ బర్‌జాత్యా మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

అలాగే..విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందని చాలా కాలాంగా ఊరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చూసి రీమేక్ కు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ విషయమై కాపీ రైట్ కేసు ఉండటంతో ఆగిపోయిందని వినికిడి. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

సౌత్ సినిమా రీమేక్‌ల్లో నటించడానికి ఆసక్తి కనబరుచే సల్మాన్‌ ఈ చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ నటించబోతున్నాడు అనే మాట కొంత కాలంగా వినిపిస్తుంది. తాజాగా మురుగదాస్‌ 'కత్తి' హిందీ రీమేక్‌లో నటించడానికి సల్లూభాయ్‌ పచ్చ జెండా వూపేశాడని సమాచారం.

''మురుగదాస్‌ చెప్పిన కథ సల్మాన్‌కు బాగా నచ్చినా ఆయన కోర్టు కేసుల్లో ఉండటంతో అప్పట్లో ఓకే చెప్పలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని అతుల్‌ అగ్రి హోత్రి నిర్మిస్తారు'' అని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

ఇక సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'సుల్తాన్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్,సల్మాన్ ఖాన్ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ తల్లిగా అలనాటి ప్రముఖ నటి రేఖ నటిస్తున్నారు. 2016 రంజాన్‌కి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

English summary
Ram Charan will be dubbing Salman Khan’s voice in the Telugu version of the upcoming Rajshri Production’s Prem Ratan Dhan Payo. Charan will be dubbing for the film at a studio in Hyderabad from Tuesday.
Please Wait while comments are loading...