»   » సల్మాన్ చేతికి రోగ్ రీమేక్ రైట్స్.. ఎగిరి గంతేస్తున్న ప్రియాంక సోదరి

సల్మాన్ చేతికి రోగ్ రీమేక్ రైట్స్.. ఎగిరి గంతేస్తున్న ప్రియాంక సోదరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోగ్' చిత్రం రీమేక్ హక్కుల్ని బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ చేజిక్కించుకున్నట్టు సమాచారం. గతంలో పూరీ చిత్రం పోకిరిని హిందీలో వాంటెడ్‌గా తీసి సల్మాన్ భారీ హిట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర హక్కులను సల్మాన్ సొంతం చేసుకొన్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలీవుడ్ అగ్రనటి ప్రియాంక చోప్రా చిన్న చెల్లెలు మన్నారా చోప్రా ఎగిరి గంతేస్తున్నది. ఎందుకంటే ఈ చిత్రంలో మన్నారా హీరోయిన్‌గా నటిస్తున్నది.

సల్మాన్ నిర్ణయంతో రేంజ్ పెరిగింది

సల్మాన్ నిర్ణయంతో రేంజ్ పెరిగింది

భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న రోగ్ చిత్రంలో భాగస్వామ్యం కావడం చాలా గర్వంగా ఉన్నది. అదే చిత్రాన్ని జాతీయస్థాయిలో సల్మాన్ నిర్మించేందుకు ముందుకు రావడం గొప్పగా అనిపిస్తున్నది. సల్మాన్ ఈ చిత్రాన్నిరీమేక్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ చిత్రం రేంజ్ ఎక్కడికో పోయిందని మన్నారా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 మన్నారాకు దక్కని విజయం

మన్నారాకు దక్కని విజయం

2014లో మన్నారా చోప్రా జిద్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు మూడు తెలుగు చిత్రాల్లో నటించింది. జక్కన్న చిత్రంలో సునీల్ పక్కన నటించింది. అయితే తన అక్కలు ప్రియాంక, పరిణితి చోప్రాలకు దక్కినంత క్రేజ్ మన్నారాకు దక్కలేదు. ప్రస్తుతం తన ఆశలన్నీ రోగ్ చిత్రంపై పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారనే వార్త మరింత ఆనందానికి గురిచేసింది.

మన్నారా ఆశలన్నీ పూరీపైనే

మన్నారా ఆశలన్నీ పూరీపైనే

తాను నటించిన రెండు చిత్రాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కానీ నా కెరీర్ అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. దక్షిణాదిలో మంచి పేరు ప్రతిష్టలున్న పూరీ జగన్నాథ్‌పైనే ప్రస్తుతం నా ఆశలున్నాయి. రోగ్ చిత్రం కోసం చాలా ఆతృతగా వేచిచూస్తున్నాను. రోగ్ చిత్రంలో మన్నారా చోప్రా గాయనీ పాత్రను పోషిస్తున్నది.

యాడ్ ఫిలింలో సల్మాన్‌తో మన్నారా

యాడ్ ఫిలింలో సల్మాన్‌తో మన్నారా

కండలవీరుడు సల్మాన్‌తో మన్నారాకు మంచి సంబంధాలున్నాయి. గతంలో సల్మాన్‌తో కలిసి వ్యాపార ప్రకటనల్లో నటించింది. ‘మూడేండ్ల క్రితం సల్మాన్‌తో కలిసి సుజికీ అడ్వర్టైజ్‌మెంట్‌లో నటించాను. సల్లూభాయ్‌తో నటించడం గొప్ప అనుభూతి. ఆ సంరద్భంగా ఆయన చాలా విషయాలు చెప్పారు' అని మన్నారా తెలిపారు.

కసిగా తీస్తున్న పూరీ జగన్నాథ్

కసిగా తీస్తున్న పూరీ జగన్నాథ్

రోగ్ చిత్రంలో ఇషాన్ అనే యువకుడిని పూరీ హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం ఇజం చిత్రానికి ముందే ప్రారంభించారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ఇటీవల విడుదలైన ఇజం సక్సెస్ సాధించకపోవడంతో ఈ చిత్రాన్ని కసిగా తీస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పూరీ జగన్నాథ్‌ విడుదల చేశారు. 'రోగ్‌' అనే టైటిల్‌ ఉన్న ఈ చిత్రానికి మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ ను జత చేశారు.

English summary
Priyanka Chopra's cousin Mannara Chopra is excited about the reports of Salman Khan bagging the remake rights of the Rogue film. Her upcoming Telugu film Rogue is gearing up under Puri Jagannadh’s Direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu