For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సల్మాన్ 'దబంగ్‌-2' రిలీజ్ డేట్

  By Srikanya
  |

  ముంబై: నవరసాలు సమ్మిళితం చేసి బాలీవుడ్‌ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ రూపమిచ్చిన పోలీసు 'చుల్‌బుల్‌ పాండే'. స్టార్ సల్మాన్‌ ఖాన్‌ 'దబంగ్‌' చిత్రంలో పోషించిన ఈ పోలీసు పాత్ర జనాన్ని ఎంతగా ఆకట్టుకుందంటే అటు క్లాస్‌ నుంచి ఇటు మాస్‌ వరకు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. చుల్‌బుల్‌ పాండే అంటూ చిత్రమైన పేరుతో నల్లకళ్లద్దాలు పెట్టుకుని (అప్పుడప్పుడు వెనుక చొక్కా కాలరుకు) ఈయన బెల్టుని పట్టుకుని వేసిన డాన్స్‌ స్టెప్పులు ఏ వేదికపై చూసినా అవే కనిపించాయి. 2010వ సంవత్సరంలో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ విలన్ శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇందులోని పాటలు ఎంత ప్రేక్షకాదరణ పొందాయో మనందరికి తెలిసిన విషయమే. అదే చిత్రం తెలుగులో పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌' సాధించిన విజయం, కురిపించిన కాసుల గలగలలు ప్రేక్షకులకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

  ఇన్ని రకాలుగా సల్మాన్‌ ఖాన్‌కు పేరు తెచ్చిపెట్టిన ఈ దబంగ్‌ చిత్రానికి కొనసాగింపుగా (సీక్వెల్‌)'దబంగ్‌-2'(డిసెంబర్ 21) క్రిస్టమస్‌ పర్వదినం సందర్భంగా ప్రేక్షకులను పలుకరించనుంది. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని, పోస్టర్లను సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్‌ బాస్‌-6'లో ఈ సోదర ద్వయం విడుదల చేశారు. ప్రచారంలో భాగంగా యువతరాన్ని ఆకట్టుకునే ఉద్దేశంతో వారు ఎక్కువగా ఉపయోగించే అంతర్జాలంలోని ఫేస్‌బుక్‌లోనూ వీటిని ఉంచారు. ఈ చిత్రంపట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సాహాన్ని గమనిస్తుంటే మొదటి చిత్రం కంటే ఇది మరింత ఆదరణ సొంతం చేసుకోగలదని సినీ పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అర్బాజ్‌ ఖాన్‌ నిర్మాతగానే కాకుండా దర్శకుడి కుర్చీలోనూ ఆసీనుడు కావడం చెప్పుకోదగ్గ విషయం.

  అర్బాజ్‌ ఖాన్‌ భార్య మలైకా అరోరా ఖాన్‌ దబంగ్‌లో 'మున్నీ బద్నామ్‌ హుయి డార్లింగ్‌ తేరే లీయే' అంటూ చేసిన ఐటం సాంగ్‌ ప్రేక్షకులను ఒక్క వూపు వూపింది. ఈ సారి కూడా ఈమె 'పాండే జీ సీటీ బజాయే' అంటూ ఒక ప్రత్యేక నృత్యాన్ని ఈ దబంగ్‌-2లో చేయగా, కరీనా కపూర్‌ 'ఫెవికాల్‌ సే' అంటూ మరో ఐటం సాంగ్‌కు కాలుకదపడం చెప్పుకోదగ్గ విషయం. సినిమాపై ప్రేక్షకులకు మరింత ఉత్సుకత కలిగించడానికి ఈ ఇద్దరి భామల ఆహార్యాన్నే కాకుండా వారు ఈ పాటల్లో చేసిన నృత్య భంగిమలను చిత్ర ప్రచార వ్యూహంలో భాగంగా గోప్యంగా ఉంచారు. అయస్కాంతంలాంటి తన అందమైన కళ్లతో చుల్‌బుల్‌ పాండేను ఆకర్షించిన సోనాక్షి సిన్హానే దబంగ్‌-2లోనూ సల్మాన్‌ ఖాన్‌కి జోడిగా ఆడి పాడే అవకాశాన్ని దక్కించుకుంటే, శక్తివంతమైన విలన్‌ పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు సాజిద్‌-వాజీద్‌లు ఈ చిత్రానికి సమకూర్చిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి.

  English summary
  Dabangg 2 is set for a Christmas release, 23 years since his first-ever blockbuster, Maine Pyar Kiya (1989). The Sooraj Barjatya-directed film released on December 29. Now, Dabangg 2 is set to hit theatres on December 21.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X