»   » వర్షం ఎఫెక్ట్: సల్మాన్ తీర్పు 24కి వాయిదా

వర్షం ఎఫెక్ట్: సల్మాన్ తీర్పు 24కి వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ కి చెందిన హిట్ అండ్ రన్ కేసు తీర్పును స్థానిక సెషన్స్ కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. హత్య కేసు కాదు. కానీ శిక్షించదగిన హత్యా నేరమని (ఐపీసీ సెక్షన్ 304 పార్ట్-2) స్థానిక కోర్టు ఆరోపణలు మోపడాన్ని సవాల్ చేస్తూ సల్మాన్ సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన కేసు సోమవారం విచారణకు వచ్చింది.

  నగరంలో కురిసిన భారీ వర్షం వల్ల కోర్టు సిబ్బంది హాజరుకాలేదు. దీనికితోడు ఈ కేసు తీర్పును వాయిదా వేయాలని సల్మాన్ తరఫు న్యాయవాది కోరారు. ఈ మేరకు కేసు తీర్పును 24కి సెషన్స్ జడ్జి యూబీ హెజీబ్ వాయిదా వేశారు. 2002, సెప్టెంబరు 28న సల్మాన్‌ఖాన్‌ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో రోడ్డు పక్కన పడుకున్న వారిని డీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయిన సంగతి తెలిసిందే.


  సల్మాన్‌పై హత్యతో సమానమైన శిక్షార్హ నరహత్య అభియోగం పై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు త్వరలోనే తేలనుంది. ఈ అభియోగం కింద అతనికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతో ఆయన ఆయన అభిమానుల్లో,శ్రేయాభిలాషుల్లో టెన్షన్ మొదలైంది.

  మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ 17 మంది సాక్షులను విచారించిన అనంతరం కేసు తీవ్రమైందిగా పరిగణించింది. ఈ కేసు సెషన్స్‌ కోర్టులో విచారించదగిందని పునర్‌విచారణ కోసం కేసును సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేసింది.

  నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణమైనందున ఐపీసీ 304ఏ సెక్షన్‌ కింద సల్మాన్‌ను తొలుత మేజిస్ట్రేట్‌ విచారించిన సెక్షన్‌ కింద అతనికి దాదాపు రెండేళ్లు శిక్ష పడే అవకాశం ఉండేదని వాదోపవాదాలకు అవకాశమివ్వాలంటూ సల్మాన్‌ న్యాయవాది రాతపూర్వకంగా విన్నవించారు.


  ఈ కేసులో సాక్షిగా ఉన్న సల్మాన్‌ అంగరక్షకుడు రవీంద్ర పాటిల్‌ ఇటీవలే మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్‌తో పాటే కారులో ఉన్నారని, వేగంగా నడపకూడదని, ఏదైన ప్రమాదం జరగుతుందని హెచ్చరించినప్పటికీ అతని మాటలు సల్మాన్‌ పట్టించుకోలేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు.


  ప్రమాదం జరిగిన సమయంలో ఖాన్‌ పరిమితికి మించి మద్యంసేవించి ఉన్నారని అతని రక్తనమూనాలో 60 మిల్లీగ్రాముల అల్కహాల్‌ను గుర్తించినట్లు ఆయన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ కేసుతో సంబంధం గల మరో పిటిషన్‌పైన కోర్టు జూన్‌ 10న తీర్పు ఇవ్వనుంది.

  English summary
  
 A session court on Monday, June 10 was expected to deliver its verdict on Salaman Khan's plea in connection with infamous hit and run case. The actor had appealed against a magistrate's order for his retrial in the 2002 hit-and-run case under stringent charge of culpable homicide not amounting to murder. However, the court hearing has been adjourned till June 24. Salman's lawyer Ashok Mundargi urged the court to adjourn the case when court staff failed to appear before the court on time due to heavy rain in the city. As the prosecutor did not object, the court deferred its verdict till June 24.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more