»   »  తెరవెనక ఓ.కే...తెరమీదే...

తెరవెనక ఓ.కే...తెరమీదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Katrina Kaif
సల్మాన్ ఖాన్,కత్రినా కైఫ్ ఇద్దరూ తెరవెనక ప్రేమికులు..రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్న జంట. అయితే కత్రినా తో సల్మాన్ తెరపై రొమాన్స్ కు ఇబ్బందిపడుతున్నాడుట.ఈ విషయన్ని అతనే స్వయంగా తెలియజేశాడు. తొలిసారిగా వీళ్ళిద్దరూ 'యువరాజ్‌' సినిమాలో రొమాంటిక్‌ జంటగా నటిస్తున్నారు.'తెరమీద నిజ జీవిత ప్రేమికులు జంటగా నటిస్తుంటే ప్రేక్షకులు ఎక్కువ ఆశించడం సహజం. ఇదే నాలో టెన్షన్‌ కలిగిస్తోంది. అందుకే కత్రినాతో రొమాంటిక్‌ సీన్లు చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డా' అని సల్మాన్‌ తెలిపాడు. ఆ ఇద్దరూ ఇదివరకు కొన్ని సినిమాలు చేసినప్పటికీ, రొమాంటిక్‌ పెయిర్‌గా కనిపించలేదు. 'మైనే ప్యార్‌ క్యోం కియా' సినిమాలో ఆ ఇద్దరి మధ్య ఒక్క రొమాంటిక్‌ సీనూ లేదు. 'పార్టనర్‌'లో అయితే ఆమె గోవిందాకు జోడీగా దర్శనమిచ్చింది. తాజాగా ఆమె అక్షయ్‌కుమార్‌ సరసన నటించిన 'సింగ్‌ ఈజ్‌ కింగ్‌'సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సల్మాన్ హీరోగా చేసిన గాడ్ తూస్సీ గ్రేట్ హొ బిలో యావరేజ్ తెచ్చుకుంది.ఇక వీరి జంట తెరపై ఏం టాక్ తెచ్చుకోనుందో.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X