»   » ఫన్నీ: సల్మాన్,సోనాక్షి కలిసి...'డంబ్‌ స్మాష్‌' (వీడియో)

ఫన్నీ: సల్మాన్,సోనాక్షి కలిసి...'డంబ్‌ స్మాష్‌' (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రీసెంట్ గా ఓ కొత్త ఒరవడి మొదలైంది. సోషల్ నెట్ వర్కింగ్ ప్రియుల కోసం వచ్చిన కొత్త సాధనం 'డంబ్‌ స్మాష్‌'. దీన్ని ఉపయోగించి సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన సంభాషణలకు తమ ముఖాన్ని అరువిచ్చి చిన్న చిన్న వీడియోలు రూపొందించొచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బాలీవుడ్‌లో ఈ ఆప్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా బాలీవుడ్‌ సెల్ఫీ క్వీన్‌ సోనాక్షీ సిన్హా 'ట్రిబ్యూట్‌ టు షాట్‌గన్‌' పేరుతో ఒక వీడియోను రూపొందించింది.

 Salman Khan Makes his Dubsmash Debut with Sonakshi Sinha in Shotgun Style

'మేరే అప్నే' చిత్రంలో తన తండ్రి శత్రుఘ్నసిన్హా చెప్పిన 'శ్యామ్‌ కహా హై...' అనే సంభాషణకు సల్మాన్‌ ఖాన్‌తో కలసి ముఖాన్ని అరువిచ్చింది.

తొమ్మిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు సామాజిక అనుసంధాన వేదికల్లో మంచి స్పందన వస్తోంది. సోనాక్షీ గతంలోనూ ఇలాంటి కొన్ని సరదా వీడియోలు రూపొందించింది. మీరూ సరదాగా ఆ వీడియో పై ఓ లుక్కేయవచ్చు. ఆమె ఈ వీడియోని ట్వీట్ ద్వారా షేర్ చేసింది.

English summary
Dubsmash debut. Sonakshi Sinha recently posted a Dubsmash video with Salman, and it went viral on social media. The "Dabangg" actor also uploaded the video with the caption, "Tribute to Shotgun". In the clip, both the actors lip-synced the famous dialogue of Sonakshi's father Shatrughan Sinha (Shotugun) from his film "Mere Apne".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu