»   »  జియా వ్యవహారంతో సల్మాన్‌‌కు సంబంధం లేదు

జియా వ్యవహారంతో సల్మాన్‌‌కు సంబంధం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసు రోజుకో ములుపు తిరుగుతండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. జియా సూసైడ్ తర్వాత ఆమె రాసిన లేఖ బయట పడటంతో బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందనే బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి.

కాగా....జియా-సూరజ్ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుండటం ఆయన అభిమానులను కాస్త కలవర పరించింది. కొన్ని రోజుల క్రితం జియా ఖాన్ తల్లి రబియా మీడియాతో మాట్లాడుతూ, 'సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలి సూరజ్-జియా సంబంధం గురించి సల్మాన్‌కు చెప్పారు. అప్పుడు సల్మాన్ సూరజ్‌తో మాట్లాడారు. జియాకు దూరంగా ఉండాలని కోరాడు. కానీ సూరజ్ జియాను ప్రేమిస్తున్నానని చెప్పాడు' అని చెప్పుకొచ్చింది.

అయితే రబియా వ్యాఖ్యలను సూరజ్ తల్లి జరీనా వాహెబ్ ఖండించారు. సల్మాన్ ఖాన్‌తో ఈ విషయం గురించి అస్సలు మాట్లాడలేదు, జియాకు దూరంగా ఉండాలని సల్మాన్ కోరలేదు. ఆమె ఇతర కారణాలతో డిస్ట్రబ్ అయిన విషయాన్ని నేను ఎప్పుడో గ్రహించాను. ఆమెతో రిలేషన్ వద్దని సూరజ్‌కు నేను చెప్పాను' అని వెల్లడించింది.

జియా ఖాన్ జూన్ 3వ తేదీన ముంబై జుహులోని తను నివసిస్తున్న అపార్టుమెంటులోని ఫ్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జియా మరణానంతరం లభించిన లేఖ ఆధారంగా పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండు సూరజ్‌ను అరెస్టు చేసారు. ప్రస్తుతం సూరజ్ జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

English summary
Mumbai: Suraj Pancholi's mother has claimed that her husband Aditya Pancholi never asked superstar Salman Khan to intervene in Jiah Khan and Suraj's relationship.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu