»   » నిశ్చితార్థం పై పుకార్లు నమ్మవద్దు

నిశ్చితార్థం పై పుకార్లు నమ్మవద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, రొమేనియా టీవీ స్టార్‌ లులియా వంటూర్‌లకు నిశ్చితార్థం కాలేదని సల్మాన్‌ చెల్లెలు అర్పిత ఖాన్‌ స్పష్టం చేశారు. వారిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని వచ్చే ఏడాది వారిద్దరికీ పెళ్లి జరగబోతోందని మీడియాలో వస్తున్న వార్తల్ని అర్పిత ఖండించారు. ఈ విషయమై ఆమె ట్విట్టర్లో స్పందించారు. వెబ్‌సైట్లలో, వార్తా పత్రికల్లో సల్మాన్‌ నిశ్చితార్థం గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దంటూ ట్వీట్‌ చేశారు.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ రహస్యంగా తన ప్రియురాలు, రొమేనియన్ టీవీ యాంకర్ లులియా వేంటర్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నపట్లు వార్తలు గుప్పుమన్నాయి. లులియాతో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నట్లు చాలా ఏళ్ల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ వచ్చే ఏడాది లులియాను పెళ్లాడబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో తాజాగా మరోసారి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ మధ్య జరిగిన సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వివాహం సందర్భంగా....లులియా వేంటర్ కూడా హాజరైంది. సల్మాన్, లులియా డేటింగ్ చేస్తున్నట్లు అప్పుడే అందరికీ అర్థమైంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ ఆమెను పెళ్లాడేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Salman Khan not engaged to Iulia Vantur, tweets sister Arpita

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఓ వైపు ‘బిగ్ బాస్' రియాల్టీ షో షూటింగ్, మరో వైపు తన తాజా సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి సూరజ్ బర్‌జత్యా దర్శకత్వం వహిస్తున్నాడు. సోనమ్ కపూర్స ల్మాన్ కు జోడీగా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దివాళి సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సల్మాన్ తాజా చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' విశేషాలకు వస్తే... సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటిస్తున్న ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఈ విషయాన్ని సోనమ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. సూరజ్‌ బర్‌జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్‌, సోనమ్‌ కపూర్‌లతోపాటు అనుపమ్‌ ఖేర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Arpita Khan, who is pregnant with her first child, asked fans of her brother Salman Khan to not believe these reports and she tweeted: “Do not believe everything you read in the papers or on different websites online.”
Please Wait while comments are loading...