»   » మేం ఒంటరి కాదని ఈ రోజు అర్థమైంది: ఫ్యాన్స్‌పై సల్మాన్ ఖాన్ సోదరి

మేం ఒంటరి కాదని ఈ రోజు అర్థమైంది: ఫ్యాన్స్‌పై సల్మాన్ ఖాన్ సోదరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు తుది తీర్పు వేళ తమకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ బుధవారం నాడు ధన్యావాదాలు తెలిపారు. సల్మాన్ ఖాన్ పట్ల చూపిస్తున్న అభిమానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

తమ కుటుంబం ఒంటరి కాదని, ఈ రోజు అర్థమైందని ఆమె ట్వీట్ చేశారు. అర్పిత ఖాన్ వివాహం కొద్ది రోజుల క్రితం జరిగింది. ఆమె ఆయుష్ శర్మను వివాహం చేసుకున్నారు.

కాగా, హిట్ అండ్ రనే కేసులో సల్మాన్ ఖాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవ్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది.

Salman Khan's Sister Arpita Khan Thanks Fans for Support on 'Big' Day

ఆ సమయంలో సల్మాన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్థర్ రోడ్ జైలుకు ఆయన్ని తరలించే అవకాశం ఉంది. కోర్టు అతనికి ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తుందనేది చర్చనీయాంశం అయింది.

English summary
Salman Khan's Sister Arpita Khan Thanks Fans for Support on 'Big' Day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu