»   » ట్యూబ్‌లైట్‌పై వేటు పడింది.. సల్మాన్ భావోద్వేగం.. అయోమయం

ట్యూబ్‌లైట్‌పై వేటు పడింది.. సల్మాన్ భావోద్వేగం.. అయోమయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

భజరంగీ భాయ్‌జాన్, సుల్తాన్ ఘన విజయాల తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ నటించిన చిత్రం ట్యూబ్‌లైట్. ఈ చిత్రం 1962లో జరిగిన ఇండియా, చైనా యుద్ధ నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. అన్నదమ్ముల మధ్య సంబంధాలు, యుద్ధం వల్ల విచ్ఛిన్నం అయ్యే జీవితాలు, తదితర అంశాలను ఆధారంగా చేసుకొని భావోద్వేగంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రం గురించి సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ..

భావోద్వేగానికి లోనయ్యా..

భావోద్వేగానికి లోనయ్యా..

దర్శకుడు కబీర్ ఖాన్ కథ చెప్పినప్పుడే భావోద్వేగానికి లోనయ్యాను. నా కెరీర్‌లోనే అద్భుతమైన చిత్రంగా మిగిలిపోతుంది అని అనుకొన్నాను. ఈ మధ్య అన్నదమ్ముల మధ్య గొప్పగా చెప్పిన సినిమాల్లో ఇదే మొదటి అవుతుంది అని సల్మాన్ ఖాన్ చెప్పారు.

సోదరుడి కోసం..

సోదరుడి కోసం..

సైన్యంలో చేరి యుద్ధానికి వెళ్లిన సోదరుడి గురించి మరో సోదరుడు వేచి చూసే పాత్ర. యుద్ధానికి వెళ్లిన సోదరుడికి ఏమి జరిగింది. ఆ తర్వాత తన జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు, ఇతర అంశాలు ఈ చిత్ర కథ అని సల్మాన్ వెల్లడించారు.

సినిమా నిడివి తగ్గించారట..

సినిమా నిడివి తగ్గించారట..

ఇదిలా ఉండగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ట్యూబ్‌లైట్ చిత్రం నిడివి 2 గంటల 35 నిమిషాలు వరకు వచ్చిందట. అయితే నిడివి ఎక్కువగా ఉండటంతో దానిని 2 గంటల 16 నిమిషాలకు కుదించినట్టు తాజా సమాచారం. ప్రేక్షకుల సౌకర్యం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో సల్మాన్ చిత్రాల్లో అతితక్కువ నిడివి చిత్రంగా ట్యూబ్‌లైట్ మారింది.

ప్రశ్నగా మారిన నిర్ణయం

ప్రశ్నగా మారిన నిర్ణయం

అయితే గతంలో సల్మాన్ ఖాన్ నటించిన భజ్‌రంగీ భాయ్‌జాన్ చిత్రం నిడివి ఇంతకంటే ఎక్కువే. ఈ చిత్రం లెంగ్త్ 2 గంటల 43 నిమిషాలు ఉంటుంది. సుల్తాన్ చిత్రం 2 గంటల 50 నిమిషాలు. ప్రేమ రతన్ ధన్ పాయో 3 గంటలు. అయితే ఆ సినిమాల నిడివి వల్ల ప్రేక్షకుడు ఎలాంటి అసౌకర్యానికి గురికాలేదు. కానీ చిత్రానికి సంబంధించి 2 గంటల 35 నిమిషాలను ఎందుకు కుదించారనేది ఓ ప్రశ్నగా మారింది.

ట్యూబ్‌లైట్‌లో చైనా నటి

ట్యూబ్‌లైట్‌లో చైనా నటి

దర్శకుడు కబీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. గతంలో వీరి కలయికలో ఏక్ థా టైగర్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాలు వచ్చాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ద్వారా చైనా నటి జూ జూ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

English summary
Original plans of preserving the playing-time of 2 hours and 35 minutes for Kabir Khan’s Tubelight have now been dropped. The film has been pruned down to 2 hours 16 minutes after the entire post-production was done. Salman said "A film about the connect between two brothers hasn't been done in a while," he says, adding, "when I heard the script, I thought, this is the best film for me to do."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu