»   » రిలీజ్‌కు ముందే ట్యూబ్‌లైట్ సంచలనం.. దంగల్ రికార్డు బ్రేక్.. బాహుబలి2 అధిగమించే..

రిలీజ్‌కు ముందే ట్యూబ్‌లైట్ సంచలనం.. దంగల్ రికార్డు బ్రేక్.. బాహుబలి2 అధిగమించే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ట్యూబ్‌లైట్ చిత్రం విడుదలకు ముందే సంచలనం రేపుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన పంపిణీ హక్కులను రికార్డు ధరకు అమ్మినట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ధర దంగల్ సినిమా పంపిణీ హక్కుల కంటే ఎక్కువ అనే సమాచారం బయటకు పొక్కింది. గతంలో ఏక్‌ థా టైగర్, భజ్‌రంగీ భాయ్‌జాన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇండో, చైనా వార్

ఇండో, చైనా వార్

ట్యూబ్‌లైట్ చిత్రం చారిత్రక కథా నేపథ్యంగా రూపొందుతున్నది. 1962లో జరిగిన ఇండో, చైనా వార్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చైనా నటి జు జు నటిస్తున్నది. ఈ చిత్రం రంజాన్‌ను పురస్కరించుకొని ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్నది.

రూ.130 కోట్ల బిజినెస్..

రూ.130 కోట్ల బిజినెస్..

ఈ చిత్రానికి సంబంధించిన దేశవ్యాప్త పంపిణీ హక్కులను ఎన్‌హెచ్ స్టూడియోస్‌ సంస్థ రూ.130 కోట్లు చెల్లించి దక్కించుకొన్నట్టు వార్తలు వెల్లవడుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్‌లో రికార్డు ధర చెల్లించినట్టు తెలుస్తున్నది. ఈ మొత్తం దంగల్ చిత్రానికి మినిమమ్ గ్యారెంట్ (ఎంజీ) కంటే ఎక్కువ అని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. విడుదలకు ముందే భారీ మొత్తాన్ని దక్కించుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పెండింగ్‌లో ఓవర్సీస్ బిజినెస్

పెండింగ్‌లో ఓవర్సీస్ బిజినెస్

అలాగే ఓవర్సీస్ హక్కుల విషయంలో ఇంకా బిజినెస్ జరుగలేదని, ఈ హక్కుల కోసం యష్‌రాజ్ ఫిలింస్, ఫాక్స్‌స్టార్ సంస్థలు పోటీపడుతున్నట్టు సమాచారం. ట్యూబ్‌లైట్ చిత్రం కలెక్షన్ల పరంగా బాహుబలి2, దంగల్ చిత్రాల రికార్డులను తుడిచిపెట్టగలదనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

షారుక్ అతిథి పాత్ర

షారుక్ అతిథి పాత్ర

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అతిధి పాత్రను పోషిస్తున్నాడు. 1990 తర్వాత సల్మాన్, షారుక్ కలిసి నటించడం ఇదే తొలిసారి. షారుక్ అతిథి పాత్రకు సంబంధించిన వార్తను స్వయంగా కబీర్ ఖాన్ ట్వీట్ చేయడం గమనార్హం.

English summary
Director Kabir Khan’s Tubelight all India distribution rights of was sold at the huge price of Rs 130 crores to NH Studioz, now comes another news. The rights that have been sold in both Gujarat and Rajasthan for a record price, has been given more Minimum Guarantee (MG) by theatre owners and distributors there than even AAmir Khan's Dangal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu