twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి హిట్ చిత్రం రీమేక్ కి సల్మాన్‌ సిద్దం

    By Srikanya
    |

    ముంబై : చిరంజీవి,మురగదాస్ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన చిత్రం 'స్టాలిన్‌'. మనకు ఎవరైనా సహాయం చేస్తే కేవలం 'థ్యాంక్స్‌' చెప్పి చేతులు దులుపుకోకుండా మరో ముగ్గురికి చేతనైన సాయం చేయమని ఉద్భోదించిన చిత్రం 'స్టాలిన్‌'. 'బీయింగ్‌ హ్యూమన్‌' అనే స్వచ్ఛంద సంస్ధను ఒంటి చేత్తో నడుపుతున్న సల్మాన్‌ ఖాన్‌ను ఆకర్షించింది ఈ స్టాలిన్‌ చిత్ర ఇతివృత్తం. రీసెంట్ గా ఈ చిత్రం చూసిన సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం.

    చిరంజీవి హీరోగా దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాసు దర్శకత్వంలో 2006వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం ప్రతి మనిషికి సమాజంపట్ల నిర్వర్తించవలసిన కనీస కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. చిరంజీవి ఒక మాజీ సైనికుడి పాత్రలో నటించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. వరసగా రీమేక్ లు చేసుకుంటూ పోతున్న సల్మాన్ కి ఈ చిత్రంలోనే కాన్సెప్టు నచ్చింది. తన సొంత స్టైల్స్ మేనరిజమ్స్ కలిపి చిత్రం రూపొందిస్తే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం కలిగింది.

    సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సోహెల్‌ ఖాన్‌ దర్శకుడిగా ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించనున్నట్లు సమాచారం. 2013వ సంవత్సరం ఈద్‌ పండుగకు ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా సల్మాన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్‌ సమాచారం. ఈ పండుగ సందర్భంగా విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ చిత్రాలు బాక్సాఫీసును బద్ధలుకొట్టాయి.

    ఈద్‌ పండుగకు వచ్చిన చిత్రాల్లో 2009వ సంవత్సరంలో వచ్చిన 'వాంటెడ్‌', 2010లో విడుదలైన దబంగ్‌, 2011లో బాడీగార్డ్‌తో పాటు ఈ సంవత్సరం ప్రేక్షకులను అలరించిన 'ఏక్‌ థా టైగర్‌'లు ఈద్‌ పండుగకు సల్మాన్‌కు గిప్ట్ లు. అందుకే రాబోయే సంవత్సరంలోనూ ఈద్‌కు వెండితెరపై రానున్న తన చిత్రం కూడా అంతే విషయం ఉన్నది కావాలన్నది సల్మాన్‌ అభిలాష. సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే ఈ స్టాలిన్‌ కథానాయకుడిగా బీయింగ్‌ హ్యూమన్‌ సంస్ధ ద్వారా పలు రకాల సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న సల్మాన్‌ అయితేనే బాగుంటుందన్నది కూడా పలువురి అభిప్రాయం.

    English summary
    Salman Khan, who re-invented himself as a massy hero with South remake Wanted, seems to be gearing up for another remake- that of Telugu hit Stalin, which had starred Chiranjeevi.
 Confirming the news, Salman was quoted saying that he quite liked the idea of a remake of Stalin as it is a film based on humanitarian issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X