»   » ‘పెళ్లిచూపులు’ రీమేక్‌ కి సల్మాన్‌ సై,కానీ..

‘పెళ్లిచూపులు’ రీమేక్‌ కి సల్మాన్‌ సై,కానీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మలు ప్రధాన పాత్రల్లో నటించిన పెళ్లిచూపులు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్ద హిట్‌ అయిన సంగతితెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో సల్లూభాయ్‌ తన బావమరిది ఆయుష్‌ శర్మను బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పెళ్లి చూపులు నిర్మాత రాజ్‌ కందుకూరి మీడియా కి తెలియచేసారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.... ''అవును. ఈ సినిమా రీమేక్‌ని సల్మాన్‌తో చేయబోతున్నాం. ఈ విషయం గురించి సల్మాన్‌తో మాట్లాడే వీలులేకపోవడంతో ఆయన బావ అతుల్‌ అగ్నిహోత్రితో చర్చించాం'' అన్నారు. రాజ్‌ కందుకూరితో పాటు తరుణ్‌ భాస్కర్‌ కూడా ఉన్నారు.


అలాగే సల్మాన్‌తో ఈ మీటింగ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఏర్పాటుచేశారు. ఆయనే పెళ్లిచూపులు దర్శకుడిని, నిర్మాతని సల్మాన్ కు పరిచయం చేశారు. అయితే ఈ రీమేక్‌ హక్కుల కోసం చిత్రబృందం కోటి రూపాయలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.


Salman Khan to remake Telugu movie Pelli Choopulu

ఈ విషయమై సల్మాన్‌ తరఫున విజయేంద్ర ప్రసాద్‌ చిత్ర యూనిట్ తో మాట్లాడనున్నారు. దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ కూడా తరుణ్‌ భాస్కర్‌, రాజ్‌ కందుకూరితో చర్చించనున్నారు. ఏ విషయం అన్నది తరుణ్‌, రాజ్‌లు వారంలోపు సల్మాన్‌తో మాట్లాడి డీల్‌ ఫైనలైజ్‌ చేస్తారని సమాచారం. విజయోంద్రప్రసాద్ ఇచ్చిన కథతో భజరంగీ భాయీజాన్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.


ఇక తెలుగులో పెళ్లిచూపులు చిత్రాన్ని తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు కాబట్టి హిందీ వెర్షన్‌ కూడా ఆయనే దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఆయన్ని ఒప్పించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

English summary
Pellichoopulu producer Raj Kandukuri says, “Yes, we had a meeting scheduled with Salman Khan on Thursday evening, as he wants to remake Pellichoopulu in Hindi. Since he was unavailable, his brother-in-law Atul Agnihotri represented him.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X