»   » సల్మాన్‌ కు ఫేవర్ గా ఒక్క సాక్ష్యమే

సల్మాన్‌ కు ఫేవర్ గా ఒక్క సాక్ష్యమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు కాస్త ఊరట కలిగించే రీతిలో కోర్టులో ఒకరు సాక్ష్యమిచ్చారు. పన్నెండేళ్ల క్రితం అర్థరాత్రి వేళ ముంబయి సబర్బన్‌ ప్రాంతమైన బాంద్రా వద్ద మద్యం మత్తులో కారు నడుపుతూ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిలో ఒకరి మృతికి, మరో నలుగురు గాయాల పాలు కావడానికి కారణమైనట్లు సల్మాన్‌ఖాన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

దీనిపై కొనసాగుతున్న విచారణలో భాగంగా సల్మాన్‌ పొరుగింటిలో నివాసం ఉండే ఫ్రాన్సిస్‌ ఫెర్నాండెజ్‌ మంగళవారం న్యాయస్థానంలో సాక్ష్యం ఇచ్చారు. సంఘటన జరిగిన రోజు అరుపులు, కేకలు విని తాను వెళ్లేసరికి కొంతమంది స్థానికులు కర్రలు, రాళ్లతో సల్మాన్‌ఖాన్‌ను చుట్టుముట్టి ఉన్నారనీ, తాను ఆయన సమీపానికి వెళ్లినప్పుడు కూడా మద్యం వాసనేమీ రాలేదని వివరించారు.

ఖాన్‌ మామూలుగానే కనిపించారనీ, తిన్నగానే నడిచారనీ, మద్యం తాగిన దాఖలాలే లేవని స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో ఉండడం సురక్షితం కాదని భావించి తమ కారులో సల్మాన్‌ను ఇంటికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇప్పటివరకు ఏడుగురు సాక్షులు తమ సాక్ష్యాలను ఇచ్చారు. తదుపరి విచారణను జూన్‌ 23వ తేదీకి వాయిదా వేశారు.

Salman Khan wasn't drunk as he didn't smell of alcohol

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపైనుంచి కారు పోనిచ్చిన కేసులో తాజాగా మళ్లీ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో 64 మంది సాక్షులను విచారించాలంటూ వారి జాబితాను విచారణాధికారులు కోర్టుకు అందజేశారు. అనంతరం సెషన్స్‌ కోర్టు జడ్జి కేసును ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి అదనపు పత్రాలు ఏమైనా ఉంటే సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించారు.

శిక్షార్హమైన హత్యానేరం కోణంలో సాక్షులను గతంలో విచారించని కారణంగా ఈ కేసును తాజాగా మరోసారి విచారించాలంటూ డిసెంబరు 5న కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ సాక్షులను విచారించాలని నిర్ణయించారు. 2002లో తన టయోటా కారులో వెళుతూ బాంద్రా సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపైనుంచి పోనిచ్చారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు.

English summary
In a breather to actor Salman Khan, a witness informed a local court that it appeared to him that the actor was not drunk at the relevant time after he had rammed his car into a shop in suburban Bandra in 2002, killing one person and injuring four others who were sleeping outside.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu