»   » మత అసహనం వివాదం: డిఫరెంటుగా స్పందించిన సల్మాన్

మత అసహనం వివాదం: డిఫరెంటుగా స్పందించిన సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశంలో మత అసహనం పెరిగి పోయిందంటూ కొందరు రచయితలు, సినీ ప్రముఖులు అవార్డులు వెనక్కి ఇవ్వడం ఇపుడు పెద్ద వివాదంగా మారింది. సినీ సెలబ్రిటీలు ఎవరు ఎదరైనా మీడియా వారు ఇదే అంశంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా షారుక్ ఖాన్ కామెంట్స్, బీజేపీ నేతలు వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు స్టార్స్ మీడియాకు ఎదురుపడటానికే జంకుతున్నారు.

ఇటీవల నాగార్జున ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడంతో మీడియా ఇదే అంశంపై ప్రశ్నిస్తే స్పందించడానికి నిరాకరించినిన ఆయన మైకులను తోసుకుంటూ వెళ్లిపోయారు. తాజాగా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' ప్రమోషన్లలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ కు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి.

Salman on religious intolerance: My mom is Sushila, my dad is Salim

అయితే సల్మాన్ ఖాన్ ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు. ‘నేను నా సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను. మత అసహనం, అవార్డులు వెనక్కి ఇవ్వడం అనే అంశంపై మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదని అనుకుంటున్నాను. అయినా సరే నేను మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. మా అమ్మ సుశీల చరక్, మా నాన్న సలీమ్' అంటూ వ్యాఖ్యానించారు. మత అసహనం అంశంపై షారుక్ ఏం మాట్లాడారో నాకు తెలియదు. అందు వల్ల నేను దానికి సమాధానం చెప్పలేను అన్నారు.

ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా వివరాల్లోకి వెళితే...
సల్మాన్, సోనమ్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సూరజ్ బరజాత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమ లీలా' పేరుతో విడుదల కాబోతోంది.ఇందులో నీల్ నితీన్ దేశ్ముఖ్, అనుపమ్ ఖేర్, స్వర భాస్కర్, సంజయ్ మిశ్రా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిమేష్ రేష్మియా, నేపధ్య సంగీతం: సంజయ్ చౌదరి, చాయాగ్రహణం: వి.మణికందన్, కూర్పు: సంజయ్ సంక్ల, పంపిణీ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నిర్మాణం: రాజశ్రీ ప్రొడక్షన్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సూరజ్ బరజాత్య!

English summary
Superstar Salman Khan today refused to be drawn into the debate over BJP leaders’ attack on Shah Rukh Khan for his “extreme intolerance” comment.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu