»   » కిడ్నాప్ కేసు, అజ్ఞాతం వీడిన ‘మెంటల్’హీరోయిన్

కిడ్నాప్ కేసు, అజ్ఞాతం వీడిన ‘మెంటల్’హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sana Khan
ముంబై : సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'మెంటల్' మూవీ హీరోయిన్ సనా ఖాన్ కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిందని ఆమెపై అభియోగం ఉంది. అప్పటి నుంచి ఆమె కనిపించకపోవడంతో పోలీసులకు దొరకకుండా పారిపోయిందని జాతీయ మీడియా కోడై కూసింది. అయితే ఎట్టకేలకు సనా ఖాన్ అజ్ఞాతం వీడింది. తాను పారిపోలేదని, కిడ్నాప్‌కు ప్రయత్నించినట్లు తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

మీడియాలో ఆమె పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని సనా ఖాన్ కొట్టి పారేసింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ సనా ఖాన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కిడ్నాప్‌కు ప్రయత్నించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను తోసి పుచ్చింది.

తాను కిడ్నాప్‌కు ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్న 15 ఏళ్ల బాలిక తల్లి తనకు అభిమాని అని చెబుతోంది సనాఖాన్. ఆమె తనను కలవడానికి ప్రయత్నించిందని, తనను, తన కజిన్‌ను ఆహ్వానించడానికి కూతురును పంపిందని, ఐస్ క్రీం పార్లర్ లో వారిని కలసామని చెబుతోంది సనా ఖాన్.

సీసీటీవీ పుటేజుల్లో ఇవన్నీ రికార్డయి ఉంటుందని, తాను ఏ తప్పూ చేయలేదనడానికి ఆ సాక్ష్యాలు చాలని కాన్ఫిడెంట్‌‌గా చెబుతోంది సనా ఖాన్. అయితే 'మెంటల్' మూవీ డైరెక్టర్ సొహైల్ ఖాన్ వాదన వేరేలా ఉంది. సనాఖాన్ షూటింగుకు హాజరు కాకపోవడం వల్ల చిత్రీకరణ నిలిచిపోయిందని చెబుతున్నాడు. మరి ఎవరికీ కనిపించకుండా సనా ఖాన్ ఎటు వెళ్లినట్లో?

English summary
Superstar Salman Khan's heroine Sana Khan has finally come out in the public and denied all the alleged accusations of kidnapping a minor girl. Sana, who will be soon seen in Salman's upcoming movie Mental, has been accused of abducting a 15-year-old girl, in association with Sana's cousin.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu