»   » నైస్ :సల్మాన్ 'ప్రేమ లీల' సాంగ్ (వీడియో)

నైస్ :సల్మాన్ 'ప్రేమ లీల' సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'. ఈ చిత్రాన్ని తెలుగులోకి ప్రేమ లీల టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదల సమయం దగ్గరపడటంతో తెలుగులోనూ పూర్తి స్ధాయి ప్రమోషన్స్ ని వేగం పెంచారు. అందులో భాగంగా సినిమాలోని ఓ పాటను విడుదల చేసారు. ఆ పాటను ఇక్కడ మీరు చూడండి.

అలాగే ఈ చిత్రానికి సంభందించిన డైలాగ్ ప్రోమో ట్రైలర్ ని వదిలారు. మరో విశేషం...రామ్ చరణ్ వాయిస్ తో ఈ ప్రోమోలు వచ్చాయి.

రాజశ్రీ సంస్థ తాజాగా సల్మాన్‌ఖాన్‌తో హిందీలో రూపొందిస్తున్న ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' తెలుగులో ‘ప్రేమలీల' పేరుతో అనువాదమవుతోంది. హిందీతోపాటు తెలుగులోనూ నవంబర్‌ 12న విడుదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రామ్‌చరణ్‌ వాయిస్‌ ఇస్తుండడం విశేషం.

సుప్రసిద్ధ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్‌ సల్మాన్‌ఖాన్‌తో రూపొందించిన ‘మైనే ప్యార్‌ కియా' చిత్రం ‘ప్రేమపావురాలు' పేరుతో.. ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌' ‘ప్రేమాలయం' పేరుతో తెలుగులో విడుదలై ఇక్కడ కూడా అసాధారణ విజయాలు సొంతం చేసుకోవడం తెలిసిందే.

Salman's Prema Leela Jvaliyinchele Video Song

సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన రామ్‌చరణ్‌.. ‘ప్రేమలీల' చిత్రంలో సల్మాన్ ఖాన్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడంతో ఈ చిత్రానికి గల క్రేజ్‌ మరింత పెరుగుతోంది. సూరజ్‌ బరజాత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ సరసన సోనమ్‌ కపూర్‌ నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విజయ దశమి కానుకగా విడుదల చేసారు.

తమ సంస్థ నుంచి వచ్చిన ‘ప్రేమ పావురాలు, ప్రేమాలయం' చిత్రాల కోవలో ‘ప్రేమ లీల' కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూలూ గిస్తుందని సూరజ్ బరజాత్య అంటున్నారు. ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్‌ను రామ్‌చరణ్‌ పూర్తి చేసారు.

నీల్ నితీన్ దేశ్ముఖ్, అనుపమ్ ఖేర్, స్వర భాస్కర్, సంజయ్ మిశ్రా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిమేష్ రేష్మియా, నేపధ్య సంగీతం: సంజయ్ చౌదరి, చాయాగ్రహణం: వి.మణికందన్, కూర్పు: సంజయ్ సంక్ల, పంపిణీ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నిర్మాణం: రాజశ్రీ ప్రొడక్షన్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సూరజ్ బరజాత్య!

English summary
T-Series Telugu presents Jvaliyinchele video song from movie "Prema Leela" starring Salman Khan, Sonam Kapoor, Anupam Kher, Neil Nitin Mukesh, Armaan Kohli.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu