»   » లాక్మే ర్యాంప్ పై సల్మాన్ గర్ల్ ఫ్రెండ్: ఈ ఫోటో చూస్తే అదిరిపోతారు

లాక్మే ర్యాంప్ పై సల్మాన్ గర్ల్ ఫ్రెండ్: ఈ ఫోటో చూస్తే అదిరిపోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2017 ముంబయిలో బుధవారం వేడుకగా జరుగుతోంది. ఈ సందర్భంగా పలువురు డిజైనర్లు తమ వస్త్రాలను ప్రదర్శించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఫ్యాషన్‌ వీక్‌లో పలువురు సినీ తారలు, మోడల్స్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులు ధరించి ఆహూతులను అలరిస్తున్నారు.

తొలిరోజు వరుణ్‌ధావన్‌, అర్జున్‌ కపూర్‌, రెండోరోజు ప్రీతీ జింటా, అదాశర్మ, రెజీనా, తమన్నాతోపాటు పలువురు మోడల్స్‌ ర్యాంప్‌పై హొయలు పోయారు. మూడో రోజున బిపాసా బసు, వాణీ కపూర్‌, నిమ్రత్‌ కౌర్‌ తదితరులు ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన దుస్తుల్లో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. .

Salman Khan's rumoured girlfriend Lulia Vantur makes fashion week debut at Lakme Fassion Week

అయితే ఇక్కడ ఇంకో విషేషం ఉంది అదేమిటంటే.... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలతోనే కాదు లవ్ ఎఫైర్స్ తో కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటాడు. తను పాల్గొనే ప్రతి పబ్లిక్ ఫంక్షన్స్ కు తన గర్ల్ ఫ్రెండ్స్ ను వెంట తీసుకురావటం సల్మాన్ కు అలవాటు. అందుకే ఆయన గర్ల్ ఫ్రెండ్స్ కు కూడా మీడియాలో ఫుల్ పబ్లిసిటీ వచ్చేస్తోంది.

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ గా ఇండియన్ మీడియాకు సుపరిచితురాలైన రొమానియన్ మోడల్ లులియా వాంటుర్.,,తాజాగా ఈ ఇంగ్లీష్ మోడల్ ఇండియన్ ర్యాంప్ మీద వేడి పుట్టించింది. లాక్మీ ఫ్యాషన్ వీక్ 2017లో లులియా సందడి చేసింది. సమ్మర్ కలెక్షన్స్ ను ర్యాంప్ పై ప్రజెంట్ చేసిన ఈ బ్యూటి ఈవెంట్ కే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్, గోల్డ్ కలర్స్ తో డిజైన్ చేసిన డ్రస్ వేసుకొని తొలిసారిగా ఇండియన్ ర్యాంప్ దర్శనమిచ్చి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.

English summary
Salman Khan's rumoured girlfriend Lulia Vantur makes fashion week debut at Lakme Fassion Week
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu