»   » అమీర్ ఖాన్ మెచ్చుకున్నాడు...పన్ను మినహాయింపుకి రిక్వెస్ట్

అమీర్ ఖాన్ మెచ్చుకున్నాడు...పన్ను మినహాయింపుకి రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై ‌: తాను ఇటీవల నటించిన చిత్రం 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని తాను కోరుకుంటున్నానని, అయితే పన్ను మినహాయింపు ఇస్తే సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఉపయోగించినట్లే అవుతుందని సల్లుభాయ్‌ పేర్కొన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన భజరంగీ భాయిజాన్‌ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓ పాకిస్థాన్‌ బాలిక తన సొంత ఇంటికి చేరుకునేందుకు ఓ భారతీయుడు సహాయం చేసే నేపథ్యంలో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని సామాజిక కోణంలో చూడాలని భారత, పాక్‌ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్‌ షరీఫ్‌లకు సల్మాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు.

Salman wants ‘Bajrangi Bhaijaan’ to be made tax-free

కలెక్షన్స్ విషయానికి వస్తే...

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'బజరంగీ భాయీజాన్‌' చిత్రం భారీ అంచనాల నడుమ జులై 17న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద విడుదలైన మొదటి రోజునే రూ.27.25 కోట్లను వసూళు చేసింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. సల్మాన్‌ ఖాన్‌తో పాటుగా కరీనా కపూర్‌, నవాజుద్దీన్‌ సిద్ధికీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

భజరంగీ భాయ్‌జాన్‌ను ఆమిర్‌ ముంబయిలో వీక్షించాడు. సల్మాన్‌ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం. అదరగొట్టేశాడంటూ సల్మాన్‌ని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచేశాడు. ఇప్పటి వరకు సల్మాన్‌ నటించిన సినిమాల్లో భజరంగీ భాయ్‌జాన్‌ ద బెస్ట్‌, మంచి కథ, సంభాషణలు, కబీర్‌ ఖాన్‌ చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ ఆమీర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.

ఈ చిత్రం గురించి అమీర్ ఖాన్ పొడగ్తల్లో ముంచెత్తారు..ఆయనేం అన్నారో ఆయన ట్వీట్ల లోనే చూడండి.

ఇప్పుడే భజరంగీ భాయీజాన్ సినిమానుంచి బయిటకు వచ్చాను..అవుట్ స్టాండింగ్...సల్మాన్ బెస్ట్ సినిమా ఇది..బెస్ట్ ఫెరఫార్మెన్స్ కూడా

అద్బుతమైన కథ, సూపర్బ్ స్క్రీన్ ప్లే, హత్తుకునే డైలాగులు, గ్రేట్ రైటింగ్

కబీర్ ఖాన్ ...ఓ ప్రత్యేకమైన సినిమాని చేసారు

తప్పకుండా చూడండి!!!

ఈ సినిమా, సినిమాలో నటించిన పాప ఇద్దరూ హృదయాలకు హత్తుకుంటారు.

English summary
Salman Khan today said he wants his recently-released film “Bajrangi Bhaijaan” to be made tax-free. “It has to be tax free. We want government to earn money from this (film), but the government should put that money for the betterment of the society, so that there is progress. But if that doesn’t happen, then the film has to be made tax free,” Salman said in an interview today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu