»   » బాల కృష్ణ, వెంకటేష్ లతో నటించా.., కమెడియన్లే నిజమైన హీరోలు.., : ఇంటర్వ్యూలో చాలానే చెప్పిన సలోనీ

బాల కృష్ణ, వెంకటేష్ లతో నటించా.., కమెడియన్లే నిజమైన హీరోలు.., : ఇంటర్వ్యూలో చాలానే చెప్పిన సలోనీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి సలోని ఎన్నో కలలుకంది. నటిగా ఓ వెలుగు వెలిగిపోవాలనుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవి ఏవీ ఈ అమ్మడికి కలిసిరాలేదు. దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి చేతిలో పడ్డా, ఫలితం లేకుండా పోయింది. 'మగధీర'లో శ్రీహరితో ఓ పాటలో మెరిసిన సలోని అటు తర్వాత 'మర్యాద రామన్న'లోనూ సునీల్‌తో జోడీ కట్టింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నా, సలోనికి మాత్రం కెరీర్‌లో స్థిరపడేలా చేయలేకపోయింది.

మధ్యలో రాజమౌళి 'మర్యాద రామన్న' ద్వారా మంచి బ్రేకిచ్చినా సలోని.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరీ పద్ధతిగా కనిపించడం వల్లో ఏమో.. సలోని కెరీర్ ఊపందుకోలేదు.వెండితెరపై ఎంతో వెలిగిపోవాలని..మరెంతో పేరు తెచ్చుకోవాలని ఆరాటపడని భామలుండరు. అయితే అందరికీ ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకునే అవకాశాలు రావు. అవి కొందరికి మాత్రమే రాసిపెట్టి వుంటాయి. అయితే ఈమధ్య వచ్చిన "మీలో ఎవరు కోటీశ్వరుడు" సినిమాతో మరో సారి తెర మీద మెరిసిన సలోనీ ఈసారైనా తన హవా కొనసాగిస్తుందా అన్న చర్చ మల్లీ మొదలయ్యింది. ఈ మధ్య నే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు ఒక సారి చూడండి.

మూడేళ్లుగా కన్నడలో:

మూడేళ్లుగా కన్నడలో:

వరుసగా సినిమాలు చేయాలని నాకూ ఉంటుంది. అయితే సరైన అవకాశాలే రావడం లేదు. దాంతో తమిళం, కన్నడ పరిశ్రమలపై దృష్టి పెడుతుంటా. రెండు మూడేళ్లుగా కన్నడలో ఎక్కువగా సినిమాలు చేస్తున్నా. ఈమధ్య అనుకోకుండా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'లో నటించే అవకాశం వచ్చింది, చేశాను.

ర్యాగింగ్‌ చేశారు:

ర్యాగింగ్‌ చేశారు:

ర్యాగింగ్‌ నేపథ్యంలో సన్నివేశాలు తీస్తున్నప్పుడు గుర్తుకొచ్చాయి. ఎందుకంటే నేను కాలేజి లో అడుగుపెట్టిన మొదటి రోజే నా సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు. అలాగని వాళ్లేమీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. నా పేరు అడిగారంతే, ఇంకేవో రెండు మూడు కొశ్చెన్లు అడిగారు. దానికే ఏడ్చేశాను.

నిన్ను ర్యాగింగ్‌ చేసిందెవరు?:

నిన్ను ర్యాగింగ్‌ చేసిందెవరు?:

నేరుగా ఇంటికెళ్లి మా నాన్నతో చెప్పాను. అది విని మా అమ్మ కోప్పడింది. పేరు అడిగితే ఏడుపెందుకు? అని తిట్టింది. మరుసటి రోజు మా నాన్న కళాశాలకి వచ్చి ‘నిన్ను ర్యాగింగ్‌ చేసిందెవరు?' అని తోటి విద్యార్థుల ముందు అడిగారు. నా పేరు అడిగిన కుర్రాడు ఎదురుగా కనిపించినా నేను మాత్రం అతన్ని చూపించలేదు.

కోరిక చిన్నప్పట్నుంచే ఉండేది:

కోరిక చిన్నప్పట్నుంచే ఉండేది:

అతను రాలేదన్నా. ఆ తర్వాత రోజు నుంచి మా అమ్మ చెప్పినట్టుగా ధైర్యంగా మెలగడం నేర్చుకొన్నా. అయితే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'లోలాగా కాలేజీలో నాకు పృథ్వీ లాంటి హీరో మాత్రం తారసపడలేదు. నటిని అవ్వాలనే కోరిక చిన్నప్పట్నుంచే ఉండేది. దాంతో మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా మా అమ్మ ప్రోత్సాహంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. ఆ తర్వాత సినిమా అవకాశాల్ని అందుకొని నా కల నెరవేర్చుకొన్నా.

నిజమైన హీరోలు:

నిజమైన హీరోలు:

నటించడం ఎక్కడైనా ఒకటే, ఎవ్వరితోనైనా ఒకటే. ఆయా కథ, పాత్రల్నిబట్టే నటించాల్సి ఉంటుంది తప్ప హాస్యనటులతో ఒకలా... మిగతా వాళ్లతో మరొకలా నటించడమంటూ ఏమీ ఉండదు. అయితే నాకు స్వతహాగా హాస్యం అంటే ఇష్టం. దాంతో హాస్యనటులతో కలిసి నటించేటప్పుడు సెట్‌లో ఇంకా ఎక్కువగా నవ్వుకొంటుంటా. ఆ వాతావరణంలో షూటింగ్‌ అంటే అసలు పనిచేసినట్టే ఉండదు. నా దృష్టిలో హాస్యనటులు నిజమైన హీరోలు.

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌:

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌:

నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. ప్రత్యేకగీతాల్లో ఆడిపాడటాన్ని ఎంతగానో ఆస్వాదిస్తా. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌లాంటి కథానాయకులతో కలిసి డ్యాన్స్‌ చేయాలని ఎప్పుడూ ఉంటుంది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోను. వాళ్ల సినిమాలే అని కాదు కానీ, మంచి చిత్రం... మంచి పాట అనుకొంటే తప్పకుండా చేస్తా.

అది నా చేతుల్లో లేని విషయం:

అది నా చేతుల్లో లేని విషయం:

హిందీలో సల్మాన్‌ఖాన్‌తో నటించాను. తెలుగులోనూ బాలకృష్ణ, వెంకటేష్‌లాంటి అగ్ర కథానాయకులతో కలిసి పని చేసాను. కానీ ఆ జోరు అలాగే కొనసాగించలేకపోయానూ అంటే..అది నా చేతుల్లో లేని విషయం. ఒక అవకాశం వచ్చిందంటే ఓ కథానాయికగా దానికి వందశాతం ఎలా న్యాయం చేయగలనన్న విషయంపైనే నా దృష్టి.

క్కువగా హారర్‌ కథలు :

క్కువగా హారర్‌ కథలు :

మిగతా విషయాలన్నీ కూడా అదృష్టం, సమయం మీదే ఆధారపడి ఉంటాయని నమ్ముతా. నాకు నచ్చే కథ, నాకు నచ్చే పాత్రలు. స్వతహాగా నాకు కామెడీ, రొమాన్స్‌తో కూడిన సినిమాలంటే ఇష్టం. అయితే ఎక్కువగా హారర్‌ కథలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్‌ కూడా హారర్‌ సినిమాలదే.

నాకు తగ్గట్టుగా పాత్ర ఉందనిపిస్తే:

నాకు తగ్గట్టుగా పాత్ర ఉందనిపిస్తే:

వాటిలో కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. కానీ ఆ కథల్లో నన్ను నేను వూహించుకోలేకపోతున్నా. దాంతో మంచి స్క్రిప్టులు వచ్చినా చేయలేనని చెప్పిన సందర్భాలున్నాయి. హారర్‌ కథలైనా వాటిలో నాకు తగ్గట్టుగా పాత్ర ఉందనిపిస్తే భవిష్యత్తులో చేస్తానేమో. అంటూ చెప్పింది సలోనీ..

అలా చేయలేదు:

అలా చేయలేదు:

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. కానీ సలోని మాత్రం అలా చేయలేదు. అందం.. అభినయం రెండూ ఉన్నా.. ఎందుకో ఈ అమ్మాయి హీరోయిన్‌గా క్లిక్ కాలేకపోయింది. 'ఒక ఊరిలో' సినిమా పోస్టర్లలో.. ప్రోమోల్లో సలోనిని చూసి పెద్ద రేంజికి వెళ్తుందేమో అనుకున్నారంతా.

ముందుకు సాగలేదు:

ముందుకు సాగలేదు:

కానీ ఆ సినిమా ఫ్లాపవడం.. ఆ తర్వాత కూడా సరైన సినిమాలు పడకపోవడంతో సలోని కెరీర్ ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు తో వచ్చిన అవకాశం అయినా మళ్ళీ సలోనీ కెరీర్ ని ఒక గాడిలో పడేస్తుందేమో చూడాలి...

English summary
In a recent Interview abut Meelo Evaru Koteeswarudu Movie pramotion Actress Saloni shared some memories from her college Days
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X