»   »  త్వరలో పెళ్లి: తన ప్రియుడి గురించి చెప్పిన సమంత!

త్వరలో పెళ్లి: తన ప్రియుడి గురించి చెప్పిన సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: హీరోయిన్ సమంత ఏ విషయం అయినా నిక్కచ్చిగా మాట్లాడుతుంది, లొపల ఒకటి పెట్టుకుని, బయటకు ఒకటి మాట్లాడటం ఆమెకు తెలియదు. ఏదైనా చెప్పాలనుకుంటే నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఆమె ట్విట్టర్ పోస్టులు చూసినా, ఏదైనా ఇంటర్వ్యూల్లో ఆమె మాట తీరు చూసినా ఈ విషయం అర్థమవుతుంది.

తాను ప్రేమలో పడ్డట్లు సమంత ఇటీవల తన ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఎవరు? అనేది మాత్రం బయట పెట్ట లేదు. తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూలో తన ప్రియుడి గురించి మరిన్ని విషయాలు చెప్పింది. అయితే ఇపుడు అతని పేరు బయట పెట్టబోనని, మరికొన్ని నెలల్లో డైరెక్టుగా పెళ్లి అనౌన్స్ మెంట్ చేసేస్తానని అంటోంది సమంత.

విపరీతమైన వర్క్ బిజీ వల్ల నా లైఫ్ నాకే బోర్ కొట్టేస్తుందని, పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని ఉందని నిర్మొహమాటంగా చెప్పింది సమంత. నా లైఫ్ లో సెటిలవ్వాలని ఉంది, మంచి ఫ్యామిలీ కావాలి, పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని తెలిపారు.

Samanatha about her Boyfriend

పెళ్లి తర్వాత కూడా నేను సినిమాలు చేస్తాను...నా వయసుకు తగిన సినిమాలు చేస్తాను, నా కుటుంబ మర్యాదను కాపాడే సినిమాలు చేస్తాను, నేను సినిమాల్లో కొనసాగడం నా బాయ్ ఫ్రెండుకు కూడా ఇష్టమే అని సమంత తెలిపారు.

అతని గురించి వివరిస్తూ....తను చాలా సంవత్సరాల నుండి నాకు పరిచయం. నాకు క్వైట్ అపోజిట్. నేను బాగా అల్లరి, సంతోషం వచ్చినా, కోపం వచ్చినా తట్టుకోలేని, అలోచించి మాట్లాడటం తెలియదు... కానీ ఆయన అలా కాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, స్టేబుల్ గా నిర్ణయాలు తీసుకోవడం, పేషెన్స్ ఉన్న వ్యక్తి. నాలాగే అతనిది కూడా హెల్పింగ్ నేచర్ అని సమంత తెలిపారు.

నాకు తినడం తప్ప వంట రాదు...ఆయన బాగా వంట చేస్తారు, నాన్ వెజ్ కూడా వండుతారు. అందుకే ఈ విషయాన్ని నేను చాలెంజ్ గా తీసుకుని వంట నేర్చుకుంటున్నాను. మా పెళ్లికి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు అని సమంత తెలిపారు.

English summary
Samanatha about her Boyfriend. For the first time ever, T-town's hottest leading lady, Samantha, opens up about her Boyfriend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu