»   » రాష్ట్ర రాజకీయాలపై సమంత...తెలివిగా ఇలా!

రాష్ట్ర రాజకీయాలపై సమంత...తెలివిగా ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ విభజన నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సమంత నటించిన 'అత్తారింటి దారేది' చిత్రంతో పాటు, ఆమె నటించిన మరో సినిమా 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కూడా ఈ పరిస్థితి కారణంగా ఇబ్బందుల్లో పడ్డాయి.

ఈ నేపథ్యంలో సమంత తనదైన రీతిలో స్పందించింది. 'ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై నేను ఏమీ మాట్లాడ దలుచుకోలేదు. నో కామెంట్' అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన చాలా మంది సమంత చాలా తెలివిగా ప్రవర్తించిందని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ, సమైక్యాంధ్ర ఎటువైపు అనుకూలంగా మాట్లాడిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్తితి ఉన్న నేపథ్యంలో సమంత ఇలా తటస్థ వైఖరి ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది.

సమంత నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా విషయానికొస్తే పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ఇటీవల విడదలై తొలివారం అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. అయితే తెలంగాణ విషయంలో జరిగిన పరిణామాలతో సీమాంధ్ర ప్రాంతంలో బంద్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కలెక్షన్లు తగ్గాయి.

సమంత నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అక్టోబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

English summary
"Thankgod for Apple TV... And the political drama section.. Names,dates,leadership,smear campaigns.. The good and the bad.. Love it all. My take on present day politics.. NO COMMENT" Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu