twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2013 తెలుగు హీరోయిన్స్: ఎవరు హిట్? ఎవరు ప్లాఫ్?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మరికొద్ది రోజుల్లో సంవత్సరం వెళ్లిపోతోంది. లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం ఇదే. తెలుగు లో నటిస్తున్న హీరోయిన్స్ లో 2013 లో హిట్స్ ఎవరు ఇచ్చారు...ఎవరు ఫ్లాఫ్స్ బారిన పడ్డారు...ఎవరి మిగిలిపోయారు అనే సమీక్ష సినీ అభిమానులకు ఆసక్తే.

    మొదట నుంచి మన తెలుగులో నలుగురైదుగురు మించి హీరోయిన్స్ మధ్య గేమ్ నడవదు. మన హీరోలంతా..వీళ్లతోనే సినిమాలు చేస్తూంటారు. కొత్తగా ఎవరైనా హీరోయిన్ తీసుకు వచ్చి పరిచయం చేస్తే తప్ప తమకు తాముగా ఎవరూ ధైర్యం చేయరు. అయితే ఈ హీరోయిన్స్ సైతం ప్రేక్షకులకు బోర్ కొట్టే స్దితి వచ్చిందనుకున్నప్పుడు కొత్తగా ముంబై నుంచో,మరో చోట నుంచో లాంచ్ చేస్తూంటారు.

    కొత్తగా లాంచ్ అవుతున్న హీరోయిన్స్ లో మహేష్‌బాబు సరసన కృతిసనన్‌, నితిన్‌ సరసన అదాశర్మ మినహా తప్ప మరే కొత్త భామా ప్రముఖంగా కనిపించడం లేదు. ఇక్కడ సక్సెస్ అయిన ఇలియానా, కాజల్,త్రిషా,అసిన్, హన్సిక,తాప్సీ అంతా బాలీవుడ్ వైపు ప్రయాణం పెట్టుకుంటున్నారు. దాంతో హీరోయిన్స్ కొరత ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది.

    2013 లో మన హీరోయిన్స్ పై ఓ లుక్... స్లైడ్ షోలో ...

    అనుష్క అదుర్స్

    అనుష్క అదుర్స్

    అరుంధతి చిత్రం నాటి నుంచి అనుష్క దారి మళ్లించి తన చుట్టూ తిరిగే లేదా తనకు ప్రాధాన్యత ఉండే కథలకు ప్రయారిటి ఇస్తూ వస్తోంది. అంతేకాదు ఈ సంవత్సరం మొత్తం ఆమెకు కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలతోనే సరిపోయింది. ఈ సంవత్సరం విడుదలైన 'మిర్చి', 'సింగమ్‌'లాంటి వాణిజ్య ప్రధానమైన చిత్రాలు అనుష్కకి విజయాల్ని తెచ్చిపెట్టాయి. 'వర్ణ'కోసం అనుష్క తెగ కష్టపడింది. అయితే ఫలితం మాత్రం దక్కలేదు. ప్రస్తుతం 'రుద్రమదేవి', 'బాహుబలి' చిత్రాల్లో నటిస్తోంది. వీటిలోనూ కత్తి దూస్తోంది. 'రుద్రమదేవి' వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకొస్తుంది. 'బాహుబలి' మాత్రం 2015లో విడుదలవుతుంది. వచ్చే యేడాది 'భాగమతి' చిత్రంలో నటించాలని నిర్ణయించుకుంది. 'వర్ణ' ఆడియో వేడుకలో 'ఇక నుంచి హీరోలతో కలిసి ఆడిపాడేందుకే ప్రాధాన్యమిస్తా' అని చెప్పుకొచ్చింది.

    సమంతదే హవా...

    సమంతదే హవా...

    సంక్రాంతికి వచ్చిన మహేష్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' హిట్ తో సమంత సంవత్సరం మొదలెట్టింది . ఆ తర్వాత 'జబర్‌దస్త్‌'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అది ఫ్లాఫ్ అయినా.. సమంత కెరీర్‌పై ఆ ప్రభావం పడలేదు. 'అత్తారింటికి దారేది', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె 'మనం'తో పాటు ఎన్టీఆర్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలోనూ రెండు సినిమాలకు సంతకం చేసేసింది. మధ్యలో 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'లో అతిథి పాత్రలో మెరిసింది. 'ఆటోనగర్‌ సూర్య' కూడా పూర్తి చేసింది. ఈ యేడాది ప్రేమకబుర్లతోనూ సందడి చేసింది సమంత. 'జబర్‌దస్త్‌' సినిమా సమయంలో సహనటుడు సిద్ధార్థ్‌తో ప్రేమలో పడిందని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది.

    పాపం తాప్సీ

    పాపం తాప్సీ

    తాప్సీకి మొదటి నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ సక్సెస్ లు రావటం లేదు. వరసగా ఈ సంవత్సరం 'షాడో', 'సాహసం', 'గుండెల్లో గోదారి' చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. చివరి రెండు చిత్రాలు ఓకే అనిపించుకున్నా హిట్ హీరోయిన్ కాలేకపోయింది. దీంతో తాప్సి కెరీర్‌ ఎప్పట్లాగే మళ్లీ అయోమయంలో పడింది. మరోపక్క పరభాషల్లో మాత్రం తాప్సిని విజయాలు వరించాయి. హిందీలో 'ఛష్మే బద్దూర్‌', తమిళంలో 'ఆరంభం' చిత్రాలతో సత్తా చాటింది. హిందీలో మరో కొత్త చిత్రానికి సంతకం చేసింది. తెలుగు, తమిళంలో 'ముని 3'లో నటిస్తోంది.

    ఒక హిట్టూ... ఒక ఫట్టూ

    ఒక హిట్టూ... ఒక ఫట్టూ

    'గబ్బర్‌సింగ్‌' విజయంతో వరుస అవకాశాలు అందుకొంది శ్రుతిహాసన్‌. 'బలుపు', 'ఎవడు', 'రామయ్యా వస్తావయ్యా'లాంటి భారీ చిత్రాలు చేసింది. 'బలుపు' విజయం సాధించింది. 'ఎవడు' విడుదల గురించి ఎదురు చూస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'రేసుగుర్రం'లో నటిస్తోంది. శ్రుతిహాసన్‌ ఈ యేడాది హిందీలోనూ మెరిసింది. 'డి డే', 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాల్లో నటించింది. అయితే ఫలితాలు మాత్రం ఆశించినట్లుగా రాలేదు. 'డి డే'లో శ్రుతి భంగిమలు బాగా శృతిమించాయని వివాదం రేగింది. మొత్తంగా ఈ యేడాది శ్రుతి ప్రయాణం కాస్త ప్లస్సూ, కాస్త మైనస్సూ అన్నట్టుగా సాగింది.

    తమన్నా సోసో...

    తమన్నా సోసో...

    తమన్నా...కేవలం ప్రక్కింటి అమ్మాయిలాగానే కాకుండా...గ్లామర్ హీరోయిన్ గానూ అదరకొట్టింది కానీ..ఎందుకనో ఈ సంవత్సరం ఆమె డల్ అయ్యింది. ఒక్క సినిమా మాత్రమే చేసింది. వెట్టై రీమేక్ గా వచ్చిన 'తడాఖా'తో మాత్రమే ఆమె సందడి చేసింది. అది విజయం సాధించినా పెద్దగా అవకాశాలు రాలేదు. 'హిమ్మత్‌వాలా'తో హిందీలో అదృష్టం పరీక్షించుకుంది. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. అయినా కూడా అక్కడ అవకాశాలు అందుతున్నాయి. 'ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌', 'హమ్‌ షకల్‌' అనే చిత్రాల్లో నటిస్తోంది. మహేష్‌బాబుతో 'ఆగడు'లో నటించే అవకాశాన్ని ఇటీవలే సొంతం చేసుకొంది.

    కాజల్...ఓకే ...అంతే

    కాజల్...ఓకే ...అంతే

    గత కొంత కాలంగా...కాజల్ తెలుగు సినిమాను ఊపేసిందనే చెప్పాలి. అయితే 2013 సంవత్సరం ఆమెకు ఊపు ఇవ్వలేదు. 'బాద్‌షా' తర్వాత తెలుగులో అస్సలు కనిపించలేదు. చాలా మంది దర్శకనిర్మాతలు వెంటపడినా... నో చెప్పింది. రెమ్యునేషన్ విషయంలో అసంతృప్తితోనే తెలుగుకి దూరమైందని ప్రచారం సాగుతోంది. కాజల్‌ మాత్రం ఇప్పటికీ తెలుగులో కథలు వింటూనే ఉన్నా అని చెబుతోంది. ఈ యేడాది 'నాయక్‌', 'బాద్‌షా' చిత్రాలతో సక్సెస్ లు అందుకొంది. 'ఎవడు'లో అతిథి పాత్ర చేసింది. తమిళంలో రెండు సినిమాలు చేసింది. మరి వచ్చే యేడాదైనా తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తుందో లేదో చూడాలి.

    నయనతార

    నయనతార

    గ్రీకు వీరుడు చిత్రంతో పలకరించిన నయనతార తమ మ్యాజిక్ ని చూపించలేకపోయింది. అయితే తమిళంలో ఆమె స్టార్ గా వెలుగుతోంది. రీసెంట్ గా ఆమె తమిళంలో చేసిన ఆరంభం చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఆమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న అనామిక చిత్రంపైనే దృష్టి మొత్తం ఉంది.

    అమలాపాల్

    అమలాపాల్

    రామ్ చరణ్ తో చేసిన 'నాయక్‌' సినిమాతో అమలాపాల్‌ కెరీర్‌... వేగం అందుకొంటుంది అనుకొన్నారంతా. తర్వాత చేసిన ఇద్దరమ్మాయిలతో చిత్రం ఆమెకు సక్సెస్ కిక్ ఇవ్వలేదు. దాంతో ఎప్పట్లా నిదానంగానే సినిమాలు చేస్తోంది. అటు అందం, ఇటు అభినయం.. ఇలా తన పాత్రలో రెండూ ఉండేలా చూసుకొంటోంది. మీ వ్యూహం సరైన ఫలితాన్నే ఇస్తోందా..? అని అడిగితే ''అందులో అనుమానం లేదు. కాకపోతే విభిన్నమైన దారిలో వెళ్లాలనుకొన్నప్పుడు ఫలితాలు కాస్త ఆలస్యంగా వస్తాయి. ఈ విషయంలో కాస్త ఓపిక పట్టాల్సిందే. హీరోయిన్ గా రాణించాలంటే నటన, అందం రెండూ కావాల్సిందే. నా కెరీర్‌లో డీ గ్లామర్‌ పాత్రలు పోషించాను. నేను నటించగలననే విషయాన్ని ముందే నిరూపించుకొన్నా. ఆ తరవాత గ్లామర్‌ పాత్రలొస్తున్నాయి. ఈ రెండింటికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది'' అని చెబుతోంది అమలాపాల్‌. ప్రస్తుతం 'జెండాపై కపిరాజు' చిత్రంలో నటిస్తోంది. అది వచ్చే సంవత్సరమే విడుదలవుతుంది.

    త్రిష

    త్రిష

    ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లో నటించిన త్రిష పలు విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే 2013 సంవత్సరంలో ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చెయ్యకపోవటం చిత్రం. అయితే తొలిసారి ఆమె కన్నడలో ‘దూకుడు' చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకు త్రిష భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కన్నడ చిత్రసీమలో చర్చ జరుగుతోంది. త్రిష ఇతర సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆమె తెలుగులో ‘రంభ ఊర్వశి మేనక', తమిళంలో ‘భూలోగం', ‘ఎండ్రెండ్రుమ్ పున్నాగై', ‘కన్నాలే కన్నన్' అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఇవి విడుదల కానున్నాయి.

    రిచా గంగోపాధ్యాయ

    రిచా గంగోపాధ్యాయ

    'మిర్చి'లో రెండో హీరోయిన్ గా చేసి సక్సెస్ కొట్టిన రిచా ఆ విజయంతో సోలో హీరోయిన్ గా ప్రమోషన్‌ సంపాదించింది. 'భాయ్‌'లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తరవాత ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయి అనుకొంటే ఆ వాతావరణం ఏమీ కనపడలేదు. దాంతో ఆమె ... తాత్కాలిక విరామం ప్రకటించేసింది. చదువుల కోసం అమెరికా వెళ్లిపోయింది. దాంతో ఆమెతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న దర్శక,నిర్మాతలు షాక్ అయ్యారు. 'భాయ్‌'హిట్ అవుతుందని, ఆమెకు మంచి క్రేజ్ వస్తుందని,తమ సినిమాల్లో తీసుకోవచ్చని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఈ విషయమై రిచా మాట్లాడుతూ..''నాకు చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. సినిమాల కారణంగా చదువును పక్కన పెట్టా. ఈసారి ఎలాగైనా డిగ్రీ పట్టా తెచ్చుకోవాలని వుంది. అందుకే సినిమాల నుంచి విరామం తీసుకొన్నా. ఇది తాత్కాలిక విరామం మాత్రమే. మళ్లీ నా చదువు పూర్తయ్యాక తిరిగి వస్తా'' అంది.

    English summary
    Samantha have a packed schedule for the year 2013. The actress played the female lead in the Pawan Kalyan- Trivikram film and has a couple of projects with Junior NTR. She has also signed a film that's being made by the director of Kandireega and another one by V V Vinayk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X