For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తొడలు కనిపించేలా హాట్ గా సమంత

  By Srikanya
  |

  హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ సమంతకు తాను ఫ్యామిలీ రోల్స్ కు పరిమితమవుతున్నాననే భయం పట్టుుకున్నట్లుంది. అందుకేనేమో ఆమె ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు హాట్ గా తయారై వస్తోంది. తాజాగా ఆమె లేటెస్ట్ చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' సక్సెస్ మీట్ కు హాట్ గా డ్రస్ చేసుకుని... తొడలు కనిపించేలా కూర్చుని అందరి దృష్టినీ ఆకర్షించింది. నాని హీరోగా వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది . డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంగా సక్సెస్ మీట్ ని ఎరేంజ్ చేసారు.

  సమంత మాట్లాడుతూ...''నిత్యలాంటి పాత్ర మళ్లీ నాకు దొరకదు. ఆ పాత్రకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నా'' అని సమంత చెప్పింది. 'ప్రస్తుతం అయిదు తెలుగు సినిమాలు, ఒక బాలీవుడ్ సినిమా తన చేతిలో ఉన్నాయని, ఇటీవల విడుదలైన 'ఎటో వెళ్లిపోయింది మనసు' తెలుగులో తన అయిదవ విజయమని ఆనందం వ్యక్తం చేసింది సమంత.

  ఆ మధ్యన హెల్త్ బాగోక గ్యాప్ తీసుకుంది. ఈ విషయం ప్రస్ధావిస్తూ... ''ఈ మధ్య కొన్ని కారణాల వల్ల ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను. ఆ రోజులు నా జీవితంలో నిజంగా బ్యాడ్ డేస్. పిచ్చెక్కిపోయిం దంటే నమ్మండి. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఏదో ఒక పని కావాలని క్రియేట్ చేసుకునేదాన్ని. మళ్లీ ఇప్పుడు బిజీ అయిపోయాను కదా... స్వర్గంలో ఉన్నట్టుంది'' అంది సమంత. మరికొన్ని విషయాలను చెబుతూ -''పనీపాటా లేకుండా ఇంట్లో నిద్రపోతూ, ఒళ్లు విరుచుకొని తినేవారంటే నాకు మహా చిరాకు.

  నాని మాట్లాడుతూ... ''స్కూలు, కాలేజీలు మానేసి మరీ విద్యార్థులు మా సినిమా చూస్తున్నారు. నెమ్మదిగా ప్రేక్షకులకు చేరువవుతోంది. ఈ సినిమాలో సమంతని ముద్దుపెట్టుకొన్న సన్నివేశం ఉంది. అది నిజం ముద్దు కాదు. మాయ చేశామంతే'' అన్నారు . అలాగే ''నేను, నా శ్రీమతి, మా మావయ్య ఈ సినిమాకెళ్లాం. సమంతతో ముద్దు సన్నివేశం వచ్చినప్పుడు కాస్త కంగారుపడ్డాను. 'వీళ్లు ఎలా అర్థం చేసుకొంటారో' అని. అది నిజం ముద్దు కాదని నా శ్రీమతికి తెలుసు. తనే వాళ్ల నాన్నకి చెప్పింది. 'నువ్వయితే మిస్‌ అయ్యావుకానీ, నేనైతే పెట్టుకొందును' అని ఆయన చమత్కరించారు. నా జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది''అన్నారు.

  'ఈ విజయంలో అందరి కృషీ ఉంది. నాని, సమంత చక్కటి నటన ప్రదర్శించారు. సాధారణ సన్నివేశాన్ని కూడా రక్తికట్టించారు. ఇళయరాజా సంగీతం లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన పాటలు విని స్ఫూర్తి పొందాను''అన్నారు దర్శకుడు. ''నాని తపన, దర్శకుడి కృషి.. ఈ విజయానికి కారణమ''ని నిర్మాత సి.కల్యాణ్‌ చెప్పారు.

  English summary
  Nani and Samantha starrer 'Yeto Vellipoyindi Manasu' Success Meet held at Hyderabad. The movie is being directed by Gautham Menon who has earned reputation for clean and romantic entertainers like Em Maya Chesave in the recent times.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X