»   » మహేష్ బాబు కంటే టాప్‌ పొజిషన్లో సమంత!

మహేష్ బాబు కంటే టాప్‌ పొజిషన్లో సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' మూవీ ఐదు రోజుల్లోనే రూ. 50 కోట్లు వసూలు చేసి సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో రూ. 50 కోట్లు దాటిన మహేష్ బాబు సినిమాల సంఖ్య 3కు చేరుకుంది. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో మహేష్ బాబు మాత్రమే.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర స్టార్ల లిస్టులో రూ. 50 కోట్ల మార్కును అందుకున్న సినిమాలు రెండు మాత్రమే ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ హడావుడి ఎక్కువైపోయింది. తమ హీరో సాధించిన ఘనత గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.

దీంతో సమంత అభిమానులకు చిర్రెత్తింది. ఈ విషయంలో మహేష్ బాబు కంటే ముందు తమ అభిమాన హీరోయిన్ ఉందంటూ ప్రచారం మొదలు పెట్టారు. మహేష్ బాబు కెరీర్లో రూ. 50 కోట్లు సాధించిన సినిమాలు 3 ఉంటే.... సమంత కెరీర్లో 4 ఉన్నాయని బాంబు పేల్చారు. మరి సమంత కెరీర్లో ఉన్న ఆ నాలుగు 50 కోట్ల సినిమాలు ఏమిటో స్లైడ్ షోలో...

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

సమంత నటించిన అత్తారింటికి దారేది చిత్రం రూ. 50 కోట్ల మార్కును అందుకుంది. ఈ చిత్రం ఈ చిత్రం 10 రోజుల్లో రూ. 55 కోట్ల షేర్ సాధించింది.

దూకుడు

దూకుడు

మహేష్ బాబు-సమంత నటించిన దూకుడు చిత్రం ఫుల్ రన్ లో రూ. 56.7 కోట్లు వసూలు చేసింది.

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి

అల్లు అర్జున్ తో కలిసి సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఫుల్ రన్ లో రూ. 51.9 కోట్లు వసూలు చేసింది.

సీతమ్మ వాకిట్లో..

సీతమ్మ వాకిట్లో..

మహేష్ బాబుతో కలిసి సమంత నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఫుల్ రన్ లో రూ. 51 కోట్లు వసూలు చేసింది.

English summary
Srimanthudu has been setting the charts and have already collected 50 crores Worldwide share even before completing one week of release. This marks a milestone in Mahesh Babu's career and the actor has now become the only hero in Telugu film industry to have three 50 crore movies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu