»   » మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్‌పై సమంత కామెంట్

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్‌పై సమంత కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తాజా సినిమా ‘శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. సైకిల్ తుక్కుతూ మహేష్ బాబు కూల్ లుక్ తో ఆకట్టుకున్నాడు. మహేష్ బాబు లుక్ అభిమానులందరికీ తెగ నచ్చేసింది. హీరోయిన్ సమంత ఈ పోస్టర్ గురించి ట్వీట్ కూడా చేసింది.

‘క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్లో మహేష్ బాబు లుక్ హ్యాండ్సమ్ గా ఉంది. ఈ సంవత్సరంలో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ పోస్టర్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను' అంటూ సమంత తన మనసులోని మాటను బయట పెట్టింది. ఈ చిత్రం జులై 17న విడుదల కాబోతోంది.


ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.


 Samantha Comments On Srimanthudu First Look

ఈ చిత్ర నిర్మాతల్లో మహేష్ బాబు కూడా ఒకరు. ‘జి. మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్ ప్రై.లి' పేరుతో మహేష్ బాబు నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ‘శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ పోస్టర్ మీద మహేష్ బాబు నిర్మాణ సంస్థకు సంబంధించిన లోగో కూడా ప్రచురించారు. దీంతో మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఈ సినిమాతోనే లాంచ్ అయినట్లయింది.


మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Samantha comments on Srimanthudu First Look poster,Mahesh babu is very handsome and clean and family entertainer.The movis is very biggest hit in this year.I feel very happy to saw this poster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu