గబ్బర్ సింగ్-2 హీరోయిన్ ఆమేనా?

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్' చిత్రానికి సీక్వెల్‌గా 'గబ్బర్ సింగ్-2' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు హీరోయిన్ ఖరారు కాలేదు. తరచూ ఏదో ఒక హీరోయిన్ పేరు వినిపిస్తుందే తప్ప...ఎవరూ ఫైనల్ కావడం లేదు.

తాజాగా ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో పవన్ సరసన నటిస్తున్న సమంత పవన్‌ను బాగా ఆకట్టుకుందని, గబ్బర్ సింగ్-2 చిత్రంలో కూడా ఆమెనే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారనటి టాక్.

ఈ చిత్ర నిర్మాత శరత్ మారార్ మీడియాతో మాట్లాడుతూ....సినిమాకు టాప్ హీరోయిన్‌ను తీసుకుంటామని చెబుతున్నారే తప్ప, సమంత పేరును మాత్రం ఖరారు చేయడం లేదు. మరి ఈ సినిమాకు సమంతే ఖరారు అవుతుందా? లేక ఇంకెవరైనా వస్తారా? అనేది తేలాల్సి ఉంది.

గబ్బర్ సింగ్-2 హిందీ వెర్షన్ దబాంగ్-2‌కు రీమేక్ కాదని తాజాగా అందుతున్న ఫిల్మ్ నగర్ సమాచారం. సరికొత్త కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, పవన్ కళ్యాణ్ మార్కు పూర్తి ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్ర్కిప్టు కూడా రాస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X