»   » ప్రిన్స్ మహేశ్ గుట్టు రట్టు చేసిన సమంత.. షూటింగ్‌లో ఎలా బిహేవ్ చేస్తాడంటే..

ప్రిన్స్ మహేశ్ గుట్టు రట్టు చేసిన సమంత.. షూటింగ్‌లో ఎలా బిహేవ్ చేస్తాడంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  దక్షిణాది అందాల తార సమంత ఇప్పుడు జీవితంలో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నది. తాను ప్రేమించిన వ్యక్తిని, తనను ప్రేమించే వ్యక్తిని పెళ్లాడటం కంటే జీవితంలో గొప్ప క్షణాలే ఏముంటాయి చెప్పండి. అందుకే మంచి మూడ్‌లో ఉంటున్న సమంత సోషల్ మీడియాలో తన అభిమానులతో తన ఆనంద క్షణాలను పంచుకొంటున్నది. తాజాగా #AskSam హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులతో ట్విట్టర్‌లో సంభాషించారు. అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు సమంత ఓపిగ్గా సమాధానమిచ్చారు.

  మహేశ్‌బాబు సీక్రెట్స్ బట్టబయలు..

  మహేశ్‌బాబు సీక్రెట్స్ బట్టబయలు..

  ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా సమంత తన తోటి నటీనటుల గురించి, తన పెళ్లి ఏర్పాట్ల గురించి అన్నీ వివరించి చెప్పింది. అంతేకాకుండా ఎలాంటి ప్రశ్నలైనా నన్ను అడిగి తెలుసుకోండి అని ఫ్యాన్స్‌ను కోరింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గురించి మాకు తెలియని విషయాలు చెప్పమని ఓ అభిమాని కోరగా చాలా ఓపెన్‌గా ప్రిన్స్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.

  samantha hot photo shoot
  మహేశ్ ఉంటే సందడి సందడిగా..

  మహేశ్ ఉంటే సందడి సందడిగా..

  మహేశ్‌బాబు‌తో కలిసి పనిచేయడం చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. సెట్ అంతా సందడి సందడిగా మారిపోతుంది. కానీ అతను షూటింగ్‌లో ఉన్నప్పడు, సీన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు గానీ ఎవరూ కూడా నవ్వకూడదు. షూటింగ్ బ్రేక్‌లో ఎంతో సరదాగా ఉంటారు. తన పనికి ఆయన చాలా కట్టుబటి ఉంటాడు. ఒకసారి షూటింగ్‌కు వస్తే దాని గురించే ఆలోచిస్తాడు అని సమంత చెప్పింది.

  ప్రిన్స్‌తో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో..

  ప్రిన్స్‌తో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో..

  ప్రిన్స్ మహేశ్‌తో కలిసి దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటించింది. సీతమ్మ వాకిట్లో.. దూకుడు సెన్సేషనల్ హిట్స్‌గా మారాయి. కానీ బ్రహ్మోత్సవం చిత్రం మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నది. ఈ చిత్రంలో మహేశ్ సరసన కాజోల్ అగర్వాల్ కూడా నటించింది. మహేశ్‌తో సమంత చేసిన చివరి సినిమా కూడా అదే కావడం గమనార్హం.

  సమంత అంటే సితారకు చాలా ఇష్టం

  సమంత అంటే సితారకు చాలా ఇష్టం

  ప్రిన్స్ మహేశ్‌బాబు‌తో సమంత మధ్య ఉన్న ఆసక్తికరమైన సన్నిహిత సంబంధాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ప్రిన్స్ మహేశ్ కూతురు సితారకు సమంత అంటే చెప్పలేనంత ఇష్టం. గతంలో బ్రహ్మోత్సవం సినిమాలో సమంత చేసిన సన్నివేశాన్ని ఇమిటేట్ చేస్తూ సితార చేసిన ఓ సీన్‌ను వీడియో తీసి నమ్రత షేర్ చేసిన సంగతి తెలిసిందే.

  డిన్నర్ గురించి ఎక్కువగా..

  డిన్నర్ గురించి ఎక్కువగా..

  నాగచైతన్య, మీకు మధ్య వచ్చే సాధారణమైన డిస్కషన్ దేనిపై ఉంటుందని సమంతను ఓ అభిమాని ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు సామ్ సమాధానమిస్తూ .. డిన్నర్‌కు ఏమి తిందాం అని మాట్లాడుకుంటాం అని సమంత చెప్పింది. అంతకంటే కామన్ పాయింట్ ఏమీ ఉండదు అని సమంత పేర్కొన్నది.

  సమంత సినిమాలు ఇవే..

  సమంత సినిమాలు ఇవే..

  ప్రస్తుతం సమంత రామ్‌చరణ్‌తో రంగస్థలం 1985, విజయ్‌తో మెర్సల్, నాగార్జునతో రాజుగారి గది2 చిత్రంలో నటిస్తున్నది. అలాగే సావిత్రి బయోపిక్‌లో అతిథి పాత్రను పోషిస్తున్నది. అలాగే తమిళంలో శివ కార్తీకేయన్ చిత్రంలో కూడా నటిస్తున్నది. ఈ చిత్రం సోమవారం (జూలై 10న) ప్రారంభమైంది.

  English summary
  Samantha revealed something about Mahesh Babu that you be surprised to know. In a fun round of #AskSam questions on social media, she spoke at length about her upcoming marriage and films, her co-stars, her wedding plans and anything her fans wanted to ask. That’s when she let out a big secret on Telugu star Mahesh Babu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more