For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  sam Chay divorce: నాగ చైతన్య ఆ రోజు కోసం ఎదురుచూస్తే.. కాస్త తొందరపెట్టిన సమంత

  |

  కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్స్ లలో నాగచైతన్య సమంత జోడి టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. వీరు ఏమైనా వేడుకకు వెళితే ఒక్కసారిగా కెమెరాలన్ని కూడా ఈ జంట పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారని చాలామంది సెలబ్రిటీలు కూడా కామెంట్ చేశారు. పదేళ్లుగా ప్రేమలో ఉన్న నాగచైతన్య సమంత మొత్తానికి ఇటీవల వారి బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు.

  నాలుగేళ్ల వారి వివాహ బంధానికి ముగింపు కార్డు వేయబోతున్నారు. ఒక విధంగా అక్కినేని అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈ విషయంపై అఫీషియల్ గా వివరణ ఇవ్వాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారట. నాగచైతన్య మాత్రం ఒక స్పెషల్ డేట్ రోజు క్లారిటీ ఇవ్వాలని ఎదురుచూస్తున్న సమయంలో మళ్లీ సడన్ గా సమంత ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  డెస్టినేషన్ వెడ్డింగ్

  డెస్టినేషన్ వెడ్డింగ్

  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్ అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. ఇటీవల కాలంలో స్టార్స్ లలో అయితే ఓకే ఇండస్ట్రీకి చెందిన వారిని ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు. ఇక ఫైనల్ గా సమంత నాగ చైతన్య గత నాలుగేళ్ల క్రితం డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. 2017 లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

  రెండు పద్దత్తుల్లో వివాహ వేడుక

  రెండు పద్దత్తుల్లో వివాహ వేడుక

  2017లో గోవాలో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత అక్టోబర్ 7వ తేదీన క్రిస్టియన్ పద్ధతిలో ఒక చర్చిలో మ్యారేజ్ చేసుకున్నారు. ఆ వేడుకకు దాదాపు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.. అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ కూడా పది రోజులపాటు అక్కడే ఉండి ఎన్నో వేడుకలతో సంతోషంగా గడిపారు.

  మరో నాలుగు రోజుల్లో యానివర్సరీ

  మరో నాలుగు రోజుల్లో యానివర్సరీ

  అక్కినేని ఫ్యామిలీలో మిగతా వారి వివాహ వేడుక కూడా అంతా వైభవంగా జరగలేదు. ఇక మరో నాలుగు రోజుల్లో 4వ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన సమంత నాగచైతన్య ఒక్కసారిగా విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు ఏం జరిగింది ఈ విషయంలో ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.

  చాలా కూల్ గా ఉండే నాగచైతన్య

  చాలా కూల్ గా ఉండే నాగచైతన్య

  సమంత నాగ చైతన్య ఇద్దరు కూడా చాలా కూల్ గా ఉంటారు అని ఇండస్ట్రీ లో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నాగ చైతన్య ఎక్కువగా వివాదాస్పద విషయాల్లో తలదూర్చకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. పర్సనల్ లైఫ్ లో కూడా అతను చాలా కూల్ గా ఉంటాడు అని నాగార్జున కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక సమంత కూడా ముందుగా ఇద్దరిలో గొడవ జరిగితే నాగచైతన్య సారీ చెబుతాడని కూడా ఇంటర్వ్యూల్లో తెలిపింది.

  ఆ స్పెషల్ డేట్ కు చెప్పాలని..

  ఆ స్పెషల్ డేట్ కు చెప్పాలని..

  ఎంతో ఆప్యాయంగా ఉండే సమంత నాగ చైతన్య విడిపోవడం అభిమానులు కాస్త అసంతృప్తికి గురి చేసింది. ఈ విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వస్తున్నప్పటికీ కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. నార్మల్ గా వచ్చే వార్తలు అని అని కొట్టిపారేశారు. ఇక నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా మొదట నాలుగవ యానివర్సరీ రోజు విడాకుల విషయాన్ని బహిరంగంగా చెప్పాలని అనుకున్నారు.

  అప్పటి వరకు వెయిట్ చేయాలని ఎక్కువగా నాగచైతన్య ఫోర్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సమంత మాత్రం ఆ స్పెషల్ డే రోజు అలాంటి విషయాన్ని చెప్పడం అంతగా బాగోదు నాలుగు రోజుల ముందే చెప్పాలని నిర్ణయం తీసుకుందట. దీంతో నాగచైతన్య కూడా ఆమె మాటకు గౌరవించి శనివారం రోజు విడాకుల విషయాన్ని బహిరంగంగా తెలియజేశాడు.

  English summary
  Samantha naga chaitanya divorce date conclusion,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X