»   » చైతు, నేను డేట్ ఫిక్స్ చేసుకున్నాం.. తల్లయ్యాక ఎక్కడా కనిపించను.. సమంత!

చైతు, నేను డేట్ ఫిక్స్ చేసుకున్నాం.. తల్లయ్యాక ఎక్కడా కనిపించను.. సమంత!

Subscribe to Filmibeat Telugu
Samantha Opens Up On Having Baby With Naga Chaitanya

గత ఏడాది చైతుని పెళ్లి చేసుకున్న సమంత వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా రంగస్థలం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. సమంత టాలీవడ్ లో లక్కీ హీరోయిన్ గా, మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ఆమె నటించిన అత్యధిక చిత్రాలు విజయం సాధించడం విశేషం. సమంత, నాగ చైతన్య గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నా సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ లో సమంత, చైతు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజగా ఓ ఇంటర్వ్యూ లో సమంత తన వైవాహిక జీవితం గురించి, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

మంచి నటిగా

మంచి నటిగా

సమంత టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సమంత అద్భుతమైన నటి మాత్రమే కాదు, లక్కీ హీరోయిన్ కూడా. సమంత నటించిన అత్యధిక చిత్రాలు విజయం సాధించాయి.

చైతుతో ప్రేమ, పెళ్లి

చైతుతో ప్రేమ, పెళ్లి

నాగచైతన్య నటించిన ఏం మాయ చేసావే చిత్రంతో సమంత టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ చిత్రం నుంచే వీరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. చివరకు పెద్దల అంగీకారంతో చై సామ్ ఒక్కటయ్యారు. ప్రస్తుతం సమంత వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

కెరీర్ పరంగా కుడా బిజీ

కెరీర్ పరంగా కుడా బిజీ

సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా బిజీగా గడుపుతోంది. తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. సమంత సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

 రంగస్థలం చిత్రంతో బ్లాక్ బాస్టర్

రంగస్థలం చిత్రంతో బ్లాక్ బాస్టర్

ఇటీవల సమంత నటించిన రంగస్థలం చిత్రం అద్భుత విజయం సాధించింది. ఈ సమంత పల్లెటూరి యువతిగా అద్భుత నటన కనబరిచింది. రంగస్థలం చిత్రానికి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని, బావుంటుందని ఊహించామని కానీ ఇంత భారీ స్థాయిలో రెస్పాన్స్ ఊహించలేదని సమంత తెలిపింది.

నేను, చైతు డేట్ ఫిక్స్ చేసుకున్నాం

నేను, చైతు డేట్ ఫిక్స్ చేసుకున్నాం

వివాహం జరిగాక పిల్లల ప్రస్తావన తప్పకుండా వస్తుంది. సమంతకు కూడా ఆ ప్రశ్న ఎదురైంది. సమంత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. తాము తల్లిదండ్రులం కావడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాం అని సమంత తెలిపింది. అనుకున్న సమయం ప్రకారం తాము బిడ్డని పొందుతామని సమంత తెలిపింది.

తల్లయ్యాక నా ప్రపంచం అదే

తల్లయ్యాక నా ప్రపంచం అదే

బిడ్డకు జన్మనిచ్చిన తరువాత నటిస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తడం కూడా సర్వ సాధారణం. తాను తల్లయ్యాక తన బిడ్డే తనకు ప్రపంచం అని సమంత తేల్చేసింది. కొన్ని సంవత్సరాల పాటు తాను ఎక్కడ కనిపించనని సమంత తెలిపింది. తన సమయాన్ని మొత్తం బిడ్డ కోసమే కేటాయిస్తానని, ఆ తరువాతే నటన గురించి ఆలోచిస్తానని చెబుతోంది.

పెళ్లయ్యాక మార్పు వచ్చింది

పెళ్లయ్యాక మార్పు వచ్చింది

తన వివాహం జరిగాక తనలో మార్పు వచ్చిందని సమంత తెలిపింది. వివాహం కాక ముందు తాను తన గురించి మాత్రమే ఆలోచించేదాన్ని అని కానీ ఇప్పడు తన కుటుంబం గురించి కూడా ఆలోచిస్తునాన్ని సమంత తెలిపింది. తాను, చైతు కలసి రోజువారీ ఇంటి ఖర్చులని లెక్కేసుకుంటాం అని కూడా వివరించింది.

English summary
Samantha opens up on having a baby with Naga Chaitanya. Samantha and Naga Chaitanya fixed date for baby.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X