»   »  పవన్ ‘అత్తారింటి...’పై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్

పవన్ ‘అత్తారింటి...’పై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హాట్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగులో సమంత చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుతోంది. అంతే కాదు సినిమా ఆల్రెడీ విజయం సాధించినట్లే అని ధీమాగా చెబుతోంది.

ఈ సినిమా గురించి ఆమె తన ట్విట్టర్లో ప్రస్తావిస్తూ....'షెడ్యూల్ పూర్తయింది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ లతో పని చేయడం చాలా బాగుంది. నవ్వులకు కొదువ లేదు. చాలా ఎంజాయ్ చేసాం' అంటూ పేర్కొంది. 'టాకీ పార్ట్ పూర్తయింది. విదేశాల్లో మరో షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. ప్రేక్షకులు కూడా అదే విధంగా ఎంజాయ్ చేస్తారు' అని చెబుతోంది.

అత్తారింటికి దారేది చిత్రంలో సమంతో పాటు ప్రణీత, బోమన్ ఇరానీ, నదియా, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో కొన్ని రోజులు తన ఫ్యామిలీతో రిలాక్స్‌గా గడపాలనే యోచనలో ఉంది సమంత.

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ యూరఫ్‌లో జరుగనుంది.

స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, ఇతర యూరోపియన్ కంట్రీలలో షూటింగ్ జరుపనున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు చిత్రీకరించనున్నారు. అందులో ఒకటి పవన్ సోలో సాంగ్ కాగా...హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించనున్నారు. అదే విధంగా టాకీ పార్టుకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఇక్కడ షూట్ చేయనున్నారు. మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Southern actress Samantha Ruth Prabhu says she thoroughly enjoyed working with the team of her upcoming film Atharintiki Daredhi Telugu family-drama starring Pawan Kalyan, and that she feels the film is already a winner. "Schedule over. I really love working with Trivikram and Pawan Kalyan. There was no shortage of laughter that's for sure," Samantha posted on her Twitter page. "Talkie (portion) done. Only one more schedule abroad. If the result of this film has anything to do with how much we enjoyed making this film, then we have winner," she posted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu