»   » ట్విట్టర్‌‌కు సమంత ఇక దూరం, అసలు ఏమైంది?

ట్విట్టర్‌‌కు సమంత ఇక దూరం, అసలు ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తన పర్సనల్ కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె అసలు కారణం ఏమిటో తెలుపక పోవడంతో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

‘కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యు. అందరూ బావుండాలి' అంటూ ఆమె ట్వీట్ చేసింది. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత ఇలా చేయడంతో ఫ్యాన్స్ అప్ సెట్ అయ్యారు. పలువురు అభిమానులు రిక్వెస్ట్ చేసినా ఆమె నుండి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు.

Samantha Quits Twitter For A While

ఆమె ట్విట్టర్ వీడటంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సిద్ధార్థతో ప్రేమ వ్యవహారం తెగదెంపులు కావడమే ఇందుకు కారణమని, ఆమె చాలా అప్ సెట్ గా ఉందని, అందుకే ట్విట్టర్ కూ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. తమ మధ్య అలాంటిదేమీ లేదని ఆ మధ్య సమంత చెప్పినా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు.

ఆ మధ్య సమంత ఆరోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈగ తర్వాత ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అప్పుడు చాలా ప్రాజెక్టులు ఆమెకు దూరం అయ్యాయి. అయితే సమంత అనారోగ్యం మళ్లీ తిరగబెట్టిందని, అందుకే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉందని, అందుకే ముందుగా ట్విట్టర్ కు స్వస్తి చెప్పిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే అసలు విషయం ఏదో తెలియక....ఈ పుకార్లు జీర్ణించుకోలేక అభిమానులు అయోమయంలో పడ్డారు. మరి అభిమానుల్లో అయోమయం తొలగించడానికి సమంత ఏదైనా ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

    Read more about: samantha, సమంత, twitter
    English summary
    "Going off Twitter for a while. God bless. Be good", Samantha tweeted last night, breaking many young hearts of her fans. They are fast enough in requesting her to re think of her decision, but Samantha did not revert.
    Please Wait while comments are loading...